BREAKING
టాక్సిక్‌ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన యశ్ మూవీ.. వరల్డ్‌వైడ్‌గా ఎన్ని కోట్లు వచ్చాయంటే? తెలంగాణలో Grain Silos అత్యాధునిక శైలిలో ధాన్యం నిల్వ: మహిళా సంఘాలకు నిర్వహణ బాధ్యతలు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై ఢిల్లీలో కీలక భేటీ: సెప్టెంబర్ 1న తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల సమావేశం అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై బన్నీ రణబాలి vs Jailer 2: దసరా బరిలో విజయ్ దేవరకొండ.. రజనీకాంత్‌తో బాక్సాఫీస్ వార్! చక్కెర కొరత భయాలు నేపాల్ వరదల్లో 21 మంది తమిళనాడు యాత్రికులు సురక్షితం అల్లు అర్జున్ ‘రాకా’ రెండు భాగాలుగా.. ‘పుష్ప’ తర్వాత మరో భారీ ఫ్రాంచైజ్? నేపాల్‌కు కొనసాగుతున్న భారత సాయం బాధితులను ఆదుకోవాలని ప్రధానికి లేఖ రాస్తున్నా - మల్లికార్జున ఖర్గే భోపాల్ లో ఇందిరా గాంధీ మ్యూజియంను సందర్శించిన ఐటీడీఏ పీవో బి, రాహుల్ కవిత సంచలన ఆరోపణలు.. హరీశ్ రావు, రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు సెప్టెంబర్ 2 తర్వాత మంత్రి కొండా సురేఖపై చర్యలు..? స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విలీనంపై రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గాలి ఆటో డ్రైవర్లకు భారీ ఊరట.. రూ.1.50 లక్షల వరకు సబ్సిడీ! తెలంగాణలో కొత్త స్కీమ్‌!

రణబాలి vs Jailer 2: దసరా బరిలో విజయ్ దేవరకొండ.. రజనీకాంత్‌తో బాక్సాఫీస్ వార్!

Select Suryaa Now
రణబాలి vs Jailer 2: దసరా బరిలో విజయ్ దేవరకొండ.. రజనీకాంత్‌తో బాక్సాఫీస్ వార్!

విజయ్ ‘రణబాలి’కి కొత్త రిలీజ్ డేట్.. దసరాకు థియేటర్లలోకి ఎంట్రీ

విజయ్ దేవరకొండ అభిమానులకు ఎట్టకేలకు గుడ్‌న్యూస్ వచ్చేసింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమా విడుదల తేదీపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 11న రావాల్సిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా వాయిదా పడగా.. ఇప్పుడు దసరా పండగను టార్గెట్ చేసింది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ ద్వారా అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా ‘రణబాలి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది.

దసరా బరిలో భారీ పోటీ!

‘రణబాలి’ విడుదల తేదీ మారడంతో బాక్సాఫీస్ వద్ద పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో రెండు సినిమాల మధ్య భారీ క్లాష్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో దసరా సీజన్‌లో తెలుగు, తమిళ సినీ అభిమానులకు ఫుల్ మీల్స్ ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

భారీ తారాగణంతో ‘రణబాలి’

రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా.. సౌత్ ఆఫ్రికన్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచింది.

“మన చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయం ఈ అక్టోబర్‌లో మొదలవుతుంది” అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో రిలీజ్ డేట్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. దీంతో ‘రణబాలి’ కథలో అసలు ఏం చూపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది.

ఇక దసరా సీజన్‌లో విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ఎలాంటి వసూళ్లు సాధిస్తుంది? రజనీకాంత్ ‘జైలర్ 2’తో పోటీలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది.