BREAKING
రణబాలి vs Jailer 2: దసరా బరిలో విజయ్ దేవరకొండ.. రజనీకాంత్‌తో బాక్సాఫీస్ వార్! చక్కెర కొరత భయాలు నేపాల్ వరదల్లో 21 మంది తమిళనాడు యాత్రికులు సురక్షితం అల్లు అర్జున్ ‘రాకా’ రెండు భాగాలుగా.. ‘పుష్ప’ తర్వాత మరో భారీ ఫ్రాంచైజ్? నేపాల్‌కు కొనసాగుతున్న భారత సాయం బాధితులను ఆదుకోవాలని ప్రధానికి లేఖ రాస్తున్నా - మల్లికార్జున ఖర్గే భోపాల్ లో ఇందిరా గాంధీ మ్యూజియంను సందర్శించిన ఐటీడీఏ పీవో బి, రాహుల్ కవిత సంచలన ఆరోపణలు.. హరీశ్ రావు, రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు సెప్టెంబర్ 2 తర్వాత మంత్రి కొండా సురేఖపై చర్యలు..? స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విలీనంపై రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గాలి ఆటో డ్రైవర్లకు భారీ ఊరట.. రూ.1.50 లక్షల వరకు సబ్సిడీ! తెలంగాణలో కొత్త స్కీమ్‌! నేపాల్ వరదల్లో 288 మంది భారతీయుల ఆచూకీ లభ్యం కావడం లేదు జబర్దస్త్ నరేష్ జీవితంలో ఊహించని కష్టాలు.. రూ.36 లక్షల ల్యాండ్ కొన్నాక ఏం జరిగిందంటే? తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆగస్టు 31 నుంచి స్కూళ్లు, కాలేజీల్లో ఉచిత బ్రేక్‌ఫాస్ట్! ఫ్రిజ్‌లో కూరగాయలు పెట్టినా త్వరగా పాడవుతున్నాయా? ఈ టిప్స్‌తో ఎక్కువ రోజులు తాజాగా ఉంచండి!

స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విలీనంపై రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గాలి

Select Suryaa Now
స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విలీనంపై రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గాలి

మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్
హైదరాబాద్: తెలంగాణలోని స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కళాశాలలను విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ కమిటీ వేయడంపై బిఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్‌ను కలపాలనే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. "అన్ని విషయాల్లో మీ గురువుగారే ఆదర్శం అంటారు కదా.. అలాంటి ఆంధ్రప్రదేశ్‌లోనే పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ యూనివర్సిటీలో కలపడం పొరపాటని గుర్తించి అక్కడి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఢిల్లీలో కూడా ఈ ప్రయోగం విఫలమై, వారు కూడా తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో విఫలమైన విధానాన్ని ఇక్కడ అమలు చేయాలని చూడటం సరికాదు" అని పేర్కొన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకుని, పాలిటెక్నిక్ విలీనంపై ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేసి, ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.