ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు
హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఉద్దేశించి ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వివాదం రేగడంతో, వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కమిటీ ఈ విచారణకు పూనుకుంది.
ఈ వ్యవహారంపై చర్చించి, విచారణ చేపట్డానికి ఆగస్టు 29న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్-1లో ఎథిక్స్ కమిటీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల తీవ్రతపై ఈ భేటీలో కమిటీ సమగ్రంగా విచారించనుంది.