BREAKING
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు 77 మంది ఇషా యాత్రికుల ఆచూకీ గల్లంతు– సద్గురు రసువా జిల్లాలో ముమ్మరంగా సహాయక చర్యలు అమెరికా, కెనడాల నుంచి భారీ పెట్టుబడులే లక్ష్యం భారత్–శ్రీలంక రెండో టెస్టు: 2-0తో సిరీస్ కైవసంపై గురి.. వరుణుడిదే కీలక పాత్ర! కొలంబో: మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్ ఈశాన్యంలో కొత్త 'డ్రగ్స్ రూట్' ఆందోళనకరం Axis Bank FD Rates: యాక్సిస్ బ్యాంక్‌లో కొత్త FD రేట్లు.. సీనియర్ సిటిజన్లకు 7.25% వడ్డీ.. రూ.5 లక్షలకు ఎంత వస్తుందంటే? నేపాల్‌ వరద బాధితులకు భారత్‌ భారీ సాయం ఆగస్టు 27న బంగారం ధరల్లో మార్పు లేదు.. కొనేవారికి ఇదే మంచి సమయం! గ్లోబల్ మార్కెట్ వీక్షణం: అమెరికా స్టాక్స్, బంగారం, వెండి, క్రూడ్ ఆయిల్ మరియు జపాన్ మార్కెట్ల సమగ్ర విశ్లేషణ నేటి స్టాక్ మార్కెట్ అంచనాలు: కీలక స్థాయిల వద్ద నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ.. ట్రేడర్లు గమనించాల్సిన అంశాలు ​మార్కెట్లలో లాభాల స్వీకరణ: 24,250 దిగువన నిఫ్టీ.. 183 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ స్టాక్ మార్కెట్లో భారీ బ్లాక్ డీల్స్: గ్రో, ఫిజిక్స్‌వాలా సహా 5 కంపెనీల్లో రూ.6,900 కోట్ల లావాదేవీలు! కొండా సురేఖ విషయంలో సీఎం మాటే నా మాట.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్

Select Suryaa Now
మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్

వరంగల్ పర్యటనను అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్: బిఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును పోలీసులు గురువారం ఉదయం ఆయన నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లాలో వివాదాస్పద జీవో 97 రద్దు చేయాలంటూ ఆందోళన బాట పట్టిన పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు ఆయన వరంగల్ పర్యటనకు సిద్ధమయ్యారు.

ఈ పర్యటనకు వెళ్లకుండా హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించిన అధికారులు, ఆయనను ఇంట్లోనే అడ్డుకున్నారు. నిరసన ప్రదర్శనలతో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్న ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రభుత్వం జీవో 97తో విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోందని, విద్యార్థుల వైపు నిలబడి పోరాడుతుంటే అక్రమంగా అరెస్టులు చేయించడం సరికాదని ఈ సందర్భంగా హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.