BREAKING
రాఖీ పౌర్ణమి వేళ ఈ 4 రాశులకు అదృష్టం.. అరుదైన యోగాలతో డబుల్ బెనిఫిట్స్! బెంగళూరు పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి బిగ్ బాస్ హౌస్‌లోకి సీరియల్ బ్యూటీ.. వారానికి రూ.4 లక్షల రెమ్యునరేషన్ అంటూ టాక్! కేరళ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగానే జాతీయ రహదారుల నిర్మాణం జరగాలి మంత్రి పదవి కోసం కేకే జోరుగా లాబీయింగ్ నయా దోపిడీకి తెరదీసిన ముఠాలు! కీలక ఖనిజాల వైపు సింగరేణి పరుగులు స్పెయిన్‌లో ‘లా టొమాటినా’ వేడుకలు హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రద్దీ కాస్త తగ్గనుంది! హిడ్మా గన్‌మెన్ ముచ్చిక మంగి లొంగుబాటు బీహార్‌లో వరద ముప్పుపై సీఎం సామ్రాట్ చౌదరితో అమిత్ షా సంభాషణ మాస్కోలో CIA చీఫ్ పర్యటన ఆకస్మిక వరదల్లో 105 మంది భారతీయులు గల్లంతు తిరుమల భక్తులకు బిగ్ గుడ్‌న్యూస్.. ఇక తిరుపతికి మరింత స్పీడ్‌గా! కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ వర్షాభావంతో రైతుల కష్టాలు.. చంద్రబాబుపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు

బెంగళూరు పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి

Select Suryaa Now
బెంగళూరు పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి

ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో కీలక భేటీ!
హైదరాబాద్/బెంగళూరు: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బెంగళూరుకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు మరియు పార్టీ అంతర్గత అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరగనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

ఇటీవల వార్తల్లో నిలిచిన మంత్రి కొండా సురేఖ వ్యవహారంతో పాటు రాష్ట్ర రాజకీయాలపై ఖర్గేతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.

మరోవైపు బెంగళూరు పర్యటనకు ముందు మంత్రి కొండా సురేఖ భర్త, కాంగ్రెస్ నేత కొండా మురళి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో భట్టిని కొండా మురళి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. భట్టి-ఖర్గే సమావేశం తర్వాత అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందోనని తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.