BREAKING
రణబాలి vs Jailer 2: దసరా బరిలో విజయ్ దేవరకొండ.. రజనీకాంత్‌తో బాక్సాఫీస్ వార్! చక్కెర కొరత భయాలు నేపాల్ వరదల్లో 21 మంది తమిళనాడు యాత్రికులు సురక్షితం అల్లు అర్జున్ ‘రాకా’ రెండు భాగాలుగా.. ‘పుష్ప’ తర్వాత మరో భారీ ఫ్రాంచైజ్? నేపాల్‌కు కొనసాగుతున్న భారత సాయం బాధితులను ఆదుకోవాలని ప్రధానికి లేఖ రాస్తున్నా - మల్లికార్జున ఖర్గే భోపాల్ లో ఇందిరా గాంధీ మ్యూజియంను సందర్శించిన ఐటీడీఏ పీవో బి, రాహుల్ కవిత సంచలన ఆరోపణలు.. హరీశ్ రావు, రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు సెప్టెంబర్ 2 తర్వాత మంత్రి కొండా సురేఖపై చర్యలు..? స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విలీనంపై రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గాలి ఆటో డ్రైవర్లకు భారీ ఊరట.. రూ.1.50 లక్షల వరకు సబ్సిడీ! తెలంగాణలో కొత్త స్కీమ్‌! నేపాల్ వరదల్లో 288 మంది భారతీయుల ఆచూకీ లభ్యం కావడం లేదు జబర్దస్త్ నరేష్ జీవితంలో ఊహించని కష్టాలు.. రూ.36 లక్షల ల్యాండ్ కొన్నాక ఏం జరిగిందంటే? తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆగస్టు 31 నుంచి స్కూళ్లు, కాలేజీల్లో ఉచిత బ్రేక్‌ఫాస్ట్! ఫ్రిజ్‌లో కూరగాయలు పెట్టినా త్వరగా పాడవుతున్నాయా? ఈ టిప్స్‌తో ఎక్కువ రోజులు తాజాగా ఉంచండి!

నేపాల్ వరదల్లో 288 మంది భారతీయుల ఆచూకీ లభ్యం కావడం లేదు

Select Suryaa Now
నేపాల్ వరదల్లో 288 మంది భారతీయుల ఆచూకీ లభ్యం కావడం లేదు

విదేశాంగ శాఖ ప్రకటన
కాట్మండు/న్యూఢిల్లీ: నేపాల్‌ను ముంచెత్తిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో భారీ సంఖ్యలో భారతీయులు గల్లంతయ్యారు. వరదల తీవ్రతకు దాదాపు 288 మంది భారతీయుల ఆచూకీ తెలియకుండా పోయిందని భారత విదేశాంగ శాఖ (MEA) అధికారిక ప్రతినిధి గురువారం వెల్లడించారు.

గల్లంతైన వారిలో తమిళనాడుకు చెందినవారు 86 మంది, పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు 32 మంది కాగా, ఇతర రాష్ట్రాలకు చెందినవారు 61 మంది వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరితో పాటు నేపాల్‌లోని కీలకమైన త్రిశూలి-1 జలవిద్యుత్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న 73 మంది భారతీయ కార్మికుల ఆచూకీ కూడా ఇప్పటివరకు లభించలేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

సహాయక చర్యల కోసం భారత ప్రభుత్వం నేపాల్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశామని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సమాచారం, సహాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్లను అందుబాటులోకి తెచ్చారు.