భోపాల్ లో ఇందిరా గాంధీ మ్యూజియంను సందర్శించిన ఐటీడీఏ పీవో బి, రాహుల్
భద్రాచలం ఆర్ సి (సూర్య మేజర్ న్యూస్ ):మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ లో ఉన్న ఇందిరా గాంధీ రాష్ట్రీయ సంగ్రహ నేషనల్ ట్రైబల్ మ్యూజియంను భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి, రాహుల్ ఐటీడీఏ బృందం తో కలసి సందర్శించారు...
ట్రైబల్ మ్యూజియం లో ఏర్పాటుచేసిన
కళాఖండాలు పెయింటింగ్ చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయని, ఇదే తరహాలోనే భద్రాచలం ఐటిడిఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను పూర్తిస్థాయి హంగులతో ముస్తాబు చేస్తామని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు .
గురువారం భోపాల్ లోని నేషనల్ ట్రైబల్ మ్యూజియం డైరెక్టర్ ఆఫ్ ఈగ్రామ్స్ ప్రొఫెసర్ అమితాప్ పాండే ఆధ్వర్యంలో నేషనల్ ట్రైబల్ మ్యూజియంలోని పెయింటింగ్ చిత్రాలు కళాఖండాలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కల్చర్ కు సంబంధించిన వివిధ రకాల వస్తువులను తాత్కాలికంగా తడకలతో నిర్మించిన ఇండ్లు కలపతో తయారుచేసిన కళాఖండాలను పూర్తిస్థాయిలో పరిశీలించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. అనంతరం, ఆయన మాట్లాడుతూ, మ్యూజియం బయట పర్యాటకులకు ఆకర్షించే విధంగా నిర్మించిన మౌంటెన్ చాలా అద్భుతంగా ఉందని, దీని తరహాలోనే ఐటీడీఏ ప్రాంగణంలోని మ్యూజియమును పూర్తిస్థాయి హంగులతో గిరిజన కల్చర్ కు సంబంధించిన వి,కొత్తగా సేకరించి పూర్తిస్థాయి డిజైన్ గా రూపొందించి పర్యాటకులకు కనువిందు కలిగేలా తయారు చేస్తామని ఆయన పేర్కొన్నారు..
ఈ సందర్భంగా భద్రాచలం ఐటిడిఏ ప్రాంగణంలో ఉన్న గిరిజన మ్యూజియం కాపీ బుక్ ను ప్రొఫెసర్ అమితాప్ పాండేకు అందించి ఇక్కడ కల్చర్ కు సంబంధించిన పూర్తి విషయాలు ఆయనకు పిఓ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, ఏ పీ ఓ పవర్ వేణు, ఏవో సున్నం రాంబాబు, మ్యూజియం ఇన్చార్జ్ వీరాస్వామి, సూపల్ నేషనల్ ట్రైబల్ మ్యూజియం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.