BREAKING
తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై ఢిల్లీలో కీలక భేటీ: సెప్టెంబర్ 1న తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల సమావేశం అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై బన్నీ రణబాలి vs Jailer 2: దసరా బరిలో విజయ్ దేవరకొండ.. రజనీకాంత్‌తో బాక్సాఫీస్ వార్! చక్కెర కొరత భయాలు నేపాల్ వరదల్లో 21 మంది తమిళనాడు యాత్రికులు సురక్షితం అల్లు అర్జున్ ‘రాకా’ రెండు భాగాలుగా.. ‘పుష్ప’ తర్వాత మరో భారీ ఫ్రాంచైజ్? నేపాల్‌కు కొనసాగుతున్న భారత సాయం బాధితులను ఆదుకోవాలని ప్రధానికి లేఖ రాస్తున్నా - మల్లికార్జున ఖర్గే భోపాల్ లో ఇందిరా గాంధీ మ్యూజియంను సందర్శించిన ఐటీడీఏ పీవో బి, రాహుల్ కవిత సంచలన ఆరోపణలు.. హరీశ్ రావు, రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు సెప్టెంబర్ 2 తర్వాత మంత్రి కొండా సురేఖపై చర్యలు..? స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విలీనంపై రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గాలి ఆటో డ్రైవర్లకు భారీ ఊరట.. రూ.1.50 లక్షల వరకు సబ్సిడీ! తెలంగాణలో కొత్త స్కీమ్‌! నేపాల్ వరదల్లో 288 మంది భారతీయుల ఆచూకీ లభ్యం కావడం లేదు జబర్దస్త్ నరేష్ జీవితంలో ఊహించని కష్టాలు.. రూ.36 లక్షల ల్యాండ్ కొన్నాక ఏం జరిగిందంటే?

బాధితులను ఆదుకోవాలని ప్రధానికి లేఖ రాస్తున్నా - మల్లికార్జున ఖర్గే

Select Suryaa Now
బాధితులను ఆదుకోవాలని ప్రధానికి లేఖ రాస్తున్నా - మల్లికార్జున ఖర్గే

కర్ణాటక:నేపాల్‌ను ముంచెత్తిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయని, అక్కడ చిక్కుకున్న భారతీయ పర్యాటకులను, బాధితులను ఆదుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయనున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.

గురువారం ఆయన కలబురగిలో మీడియాతో మాట్లాడుతూ నేపాల్ వరద పరిస్థితులపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఈ వరదల్లో కేవలం కర్ణాటకకు చెందినవారే కాకుండా, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి వెళ్లిన అనేకమంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వందలాది మంది వరద ప్రవాహంలో కొట్టుకుపోగా, మరికొందరు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. భారత్ నుండి పెద్ద సంఖ్యలో భక్తులు నేపాల్ దర్శనానికి వెళ్తుంటారు. కాబట్టి అక్కడ చిక్కుకుపోయిన మన దేశ పౌరుల కుటుంబాలకు ప్రత్యేక సహాయం అందించడంతో పాటు, నేపాల్ ప్రభుత్వానికి కూడా భారత్ తరఫున సాధ్యమైనంత ఎక్కువ సహాయ సహకారాలు అందించాలి" అని ఆయన కోరారు.

దురదృష్టవశాత్తు నేపాల్‌లో ఇంతటి భారీ విపత్తు సంభవించిందని, ప్రకృతి విపత్తులను ఎవరూ ఎదిరించలేరని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.