BREAKING
ఆస్కార్ రేసులోకి మరాఠీ థ్రిల్లర్ 'గొంధల్'... భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీ వినాయక నిమజ్జనంలో విషాదం.. చిన్నారి మృతి పట్ల మంత్రి సత్యకుమార్ యాదవ్ దిగ్భ్రాంతి చిన్నారి కుటుంబానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్ ద్వారా పరామర్శ… నీరు లేక చెరువులో వినాయకుని వదిలి వెళ్ళిన నిర్వహకులు *ప్రారంభానికి నోచుకోని ఆటోమేటిక్ వే బ్రిడ్జి* చిట్యాల - మేజర్ న్యూస్ బాక్సాఫీస్ వద్ద మమితా బైజు సరికొత్త చరిత్ర... రూ. 300 కోట్ల క్లబ్‌లో 'బెత్లహెం కుటుంబ యూనిట్' దేశంలోకి డెంగీ వ్యాక్సిన్ వచ్చేస్తోంది... త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి టీకా బీసీ జనాభాను తక్కువ చేసి చూపే కుట్ర జరుగుతోంది.. కేంద్రంపై కల్వకుంట్ల కవిత ధ్వజం భ్రమరాంబిక అమ్మవారికి మూడు తులాల బంగారు నెక్లెస్ సమర్పణ బిగ్‌బాస్ హౌస్‌లో రసవత్తరంగా కెప్టెన్సీ పోరు - షాలిని వర్సెస్ వర్షిణి మధ్య మాటల యుద్ధం గణిత శాస్త్రంలో కందుల రజనికి పీహెచ్.డీ. వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి.. అన్న జగన్‌ను ఆహ్వానించేందుకు బెంగళూరుకు వెళ్లనున్న షర్మిల ఘనంగా ఓ నా సిద్ధయ్య సాంగ్ టైటిల్ పోస్టర్ లాంచ్ - ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ అందజేసిన సిద్ధు రెడ్డి నెస్ట్ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి. దానం నాగేందర్‌కు హైకోర్టులో చుక్కెదురు.. అనర్హత పిటిషన్లపై విచారణకు ఆదేశం వివిధ శాఖలలో జరుగుతున్న అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి*

వివిధ శాఖలలో జరుగుతున్న అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి*

Select Suryaa Now
వివిధ శాఖలలో జరుగుతున్న అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి*

అనంతపురం బ్యూరో

*వివిధ శాఖలలో జరుగుతున్న అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి*

*రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు 2024 నుంచి జిల్లాకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి*

*జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*

 

జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ పెండింగ్ లేకుండా త్వరితగతిని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ వివిధ శాఖల అధికారులకు సూచించారు. 

శుక్రవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్ నందు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నవంబర్- 2024, సంవత్సరం నుంచి ఇప్పటివరకు జిల్లాలోని వివిధ శాఖలకు మంజూరు చేసిన అభివృద్ధి పనులను పెండింగ్ లేకుండా పూర్తి చేయాలన్నారు. సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నిధులు వెనక్కి వెళ్లే అవకాశం ఉందన్నారు. జిల్లాలో దాదాపు 24 శాఖలకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అభివృద్ధి పనులు మంజూరు చేయడం జరిగిందన్నారు. సీఎం ఇచ్చిన అస్యురెన్స్ పనులన్నీ పూర్తి చేయకపోతే మన జిల్లా అభివృద్ధిలో వెనుకబడే అవకాశం ఉందన్నారు. 24 శాఖల హెచ్ ఓ డి లు అభివృద్ధి పనుల నిర్వహణలో ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తెచ్చి వెంటనే పరిష్కరించుకోవాలన్నారు.

వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాలులో 30 లక్షలతో మంజూరు చేసిన హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ భవనం వెంటనే పూర్తి చేయడం జరిగిందని ఇలా ప్రతి శాఖ తమకు కేటాయించిన అభివృద్ధి పనులను నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేయాలన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వివిధ అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 

ఈ కార్యక్రమంలో సిపిఓ గిరిధర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు, డిఆర్ డి ఎ పిడి శైలజ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పిడి సాజిదా బేగం, జిల్లా విద్యాశాఖ అధికారి ఆయుబ్ హుస్సేన్, ఆర్ డబ్ల్యు ఎస్  ఎస్ఈ శ్రీనివాసులు, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.