BREAKING
ఆస్కార్ రేసులోకి మరాఠీ థ్రిల్లర్ 'గొంధల్'... భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీ వినాయక నిమజ్జనంలో విషాదం.. చిన్నారి మృతి పట్ల మంత్రి సత్యకుమార్ యాదవ్ దిగ్భ్రాంతి చిన్నారి కుటుంబానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్ ద్వారా పరామర్శ… నీరు లేక చెరువులో వినాయకుని వదిలి వెళ్ళిన నిర్వహకులు *ప్రారంభానికి నోచుకోని ఆటోమేటిక్ వే బ్రిడ్జి* చిట్యాల - మేజర్ న్యూస్ బాక్సాఫీస్ వద్ద మమితా బైజు సరికొత్త చరిత్ర... రూ. 300 కోట్ల క్లబ్‌లో 'బెత్లహెం కుటుంబ యూనిట్' దేశంలోకి డెంగీ వ్యాక్సిన్ వచ్చేస్తోంది... త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి టీకా బీసీ జనాభాను తక్కువ చేసి చూపే కుట్ర జరుగుతోంది.. కేంద్రంపై కల్వకుంట్ల కవిత ధ్వజం భ్రమరాంబిక అమ్మవారికి మూడు తులాల బంగారు నెక్లెస్ సమర్పణ బిగ్‌బాస్ హౌస్‌లో రసవత్తరంగా కెప్టెన్సీ పోరు - షాలిని వర్సెస్ వర్షిణి మధ్య మాటల యుద్ధం గణిత శాస్త్రంలో కందుల రజనికి పీహెచ్.డీ. వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి.. అన్న జగన్‌ను ఆహ్వానించేందుకు బెంగళూరుకు వెళ్లనున్న షర్మిల ఘనంగా ఓ నా సిద్ధయ్య సాంగ్ టైటిల్ పోస్టర్ లాంచ్ - ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ అందజేసిన సిద్ధు రెడ్డి నెస్ట్ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి. దానం నాగేందర్‌కు హైకోర్టులో చుక్కెదురు.. అనర్హత పిటిషన్లపై విచారణకు ఆదేశం వివిధ శాఖలలో జరుగుతున్న అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి*

భ్రమరాంబిక అమ్మవారికి మూడు తులాల బంగారు నెక్లెస్ సమర్పణ

Select Suryaa Now
భ్రమరాంబిక అమ్మవారికి మూడు తులాల బంగారు నెక్లెస్ సమర్పణ

భ్రమరాంబిక అమ్మవారికి మూడు తులాల బంగారు నెక్లెస్ సమర్పణ

రెయిన్బో మెడోస్ బీరంగూడకు చెందిన వి. శ్రీధర్ కుమార్ కుటుంబ సభ్యుల భక్తి కానుక

పటాన్‌చెరు :  నియోజకవర్గం బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో కొలువైన శ్రీ భ్రమరాంబిక అమ్మవారికి భక్తులు మూడు తులాల బంగారు నెక్లెస్‌ను కానుకగా సమర్పించారు. రెయిన్బో మెడోస్, బీరంగూడకు చెందిన వి. శ్రీధర్ కుమార్ కుటుంబ సభ్యులు భక్తిశ్రద్ధలతో ఈ బంగారు నెక్లెస్‌ను అమ్మవారికి సమర్పించారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఆలయ అధికారుల సమక్షంలో శ్రీధర్ కుమార్ కుటుంబ సభ్యులు మూడు తులాల బంగారు నెక్లెస్‌ను ఆలయ ప్రధాన అర్చకులు ప్రహ్లాద్‌కు అందజేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నెక్లెస్‌ను అమ్మవారి అలంకరణ కోసం ఆలయానికి అందించారు.భక్తుల విశ్వాసం, ఆధ్యాత్మిక భావనలకు ప్రతీకగా ఇలాంటి కానుకలు నిలుస్తాయని ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ తెలిపారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం భక్తుల సహకారం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.