BREAKING
దేశంలోకి డెంగీ వ్యాక్సిన్ వచ్చేస్తోంది... త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి టీకా బీసీ జనాభాను తక్కువ చేసి చూపే కుట్ర జరుగుతోంది.. కేంద్రంపై కల్వకుంట్ల కవిత ధ్వజం భ్రమరాంబిక అమ్మవారికి మూడు తులాల బంగారు నెక్లెస్ సమర్పణ బిగ్‌బాస్ హౌస్‌లో రసవత్తరంగా కెప్టెన్సీ పోరు - షాలిని వర్సెస్ వర్షిణి మధ్య మాటల యుద్ధం గణిత శాస్త్రంలో కందుల రజనికి పీహెచ్.డీ. వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి.. అన్న జగన్‌ను ఆహ్వానించేందుకు బెంగళూరుకు వెళ్లనున్న షర్మిల ఘనంగా ఓ నా సిద్ధయ్య సాంగ్ టైటిల్ పోస్టర్ లాంచ్ - ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ అందజేసిన సిద్ధు రెడ్డి నెస్ట్ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి. దానం నాగేందర్‌కు హైకోర్టులో చుక్కెదురు.. అనర్హత పిటిషన్లపై విచారణకు ఆదేశం వివిధ శాఖలలో జరుగుతున్న అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి* గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ప్రేమనే ఊరిలో - సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో సినీ ప్రముఖుల సందడి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు సమన్వయం తో ముందుకెళ్లాలి.. మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు అమరవీరుల స్థూపానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మందుల సామేల్ స్నేహం మరియు దేశభక్తి భావోద్వేగాల కలయికగా సీక్రెట్ సోల్జర్ మూవీ రివ్యూ - నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ స్పై యాక్షన్ డ్రామా ఎలా ఉందంటే టెక్నోస్పోర్ట్, ఐఐటీఢిల్లీ కీలక భాగస్వామ్యం.. అథ్లెట్ల కోసం అత్యాధునిక స్పోర్ట్స్‌వేర్ తయారీ

అమరవీరుల స్థూపానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మందుల సామేల్

Select Suryaa Now
అమరవీరుల స్థూపానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మందుల సామేల్

అమరవీరుల స్థూపానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మందుల సామేల్ 

 

అడ్డగూడూరు, సెప్టెంబర్  : మేజర్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలతోనే దేశానికి విముక్తి లభించిందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. గురువారం మండలంలోని ధర్మారంలో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి, తెలంగాణ అమరవీరుల స్థూపానికి పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ధర్మారం ముందు వరుసలో నిలిచిందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందు ఉండి కొట్లాడిన కాబట్టి నేను చనిపోయిన ఈ చిహ్నం చిరస్థాయిగా గుర్తుగా ఉండాలనే ఉద్దేశంతో ధర్మారం చెరువు కట్టకు అమరవీరుల స్థూపాన్ని నిర్మించడం జరుగుతుందని అన్నారు.  నైజాం ప్రభుత్వం ఉస్మాన్ అలీ ఖాన్, కాసిం రజిమీ దొరలతో, దేశ్ముకులతో జంట కట్టి పేద ప్రజలను దోపిడీ చేస్తే 1948లో నిజాం ప్రభుత్వంపై తిరుగుబాటు జరిగిందన్నారు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే, తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న (13 నెలల) తర్వాత స్వాతంత్రం వచ్చిందని అన్నారు. నల్లగొండ జిల్లా పోరాటాల గడ్డ అని నల్లగొండ అంటేనే ఒక చరిత్ర అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల త్యాగం మహోన్నత మైనదని కొనియాడారు.  కమ్యూనిస్టు, కాంగ్రెస్ పోరాటం ద్వారా నైజాం ప్రభుత్వం భారత ప్రభుత్వానికి సరెండర్ అయిందని గుర్తు చేశారు. బీజేపీకి విమోచన దినోత్సవానికి ఎలాంటి సంబంధం లేదని అప్పుడు బీజేపీ పార్టీని పుట్టలేదని అన్నారు. బీజేపీకి త్యాగాలు, పోరాటాలు  తెల్వదని అన్నారు, సెప్టెంబర్ 17 విమోచన దినం కాదని, తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు అని, తెలంగాణకు విముక్తి కలిగిన రోజు అని పేర్కొన్నారు. ఎంతోమంది తెలంగాణ అమరవీరుల పోరాటాల ఫలితంగా తెలంగాణ వచ్చిందని 1969లోనే తెలంగాణ ఉద్యమం మొదలైందని ఆనాడే 369 మంది నేల రాలారాన్నారు. మలిదశ ఉద్యమం మొదలై ఎంతోమంది విద్యార్థులు అమరులైతే తెలంగాణ వచ్చిందని వారి త్యాగ ఫలితమే నేడు తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారికి చిహ్నంగా ఈ స్థూపం విరజిల్లాలని అమరవీరులకు, కాల్చి వేయబడ్డ వాళ్లకు ఈ స్థూపం దిక్సూచిగా ఉండాలని ఆకాంక్షించారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వడం జరుగుతుందని తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు తిరుమలగిరిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. తనతో పాటు ఉద్యమం చేసిన నాయకులను గుర్తు చేసుకున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో చరిత్రలో లేని మెజార్టీ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని  రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన నియోజకవర్గ ప్రజలకు అందేలా చూడడం  నాబాధ్యత అని అన్నారు. బిక్కేరు వాగుపై చెక్ డ్యాంలు నిర్మించడం ద్వారా సాగునీరు పుష్కలంగా లభిస్తుందని అన్నారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఎంపీడీవో, ఎమ్మార్వో,  ఏటిసి భవన నిర్మాణాలను తొందర్లోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.  తెలంగాణ ఉద్యమకారులు బువ్వ కోసం కొట్లాడితే, పైనే ఉన్న నాయకులు భూముల కోసం కొట్లాడారని, సామాన్య కార్యకర్తగా ఉన్నప్పుడు మూడు ఎకరాల భూమి ఉన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి 150 ఎకరాల భూమి ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. చెప్పులు కూడా  లేని జగదీశ్వర్ రెడ్డికి వేలకోట్ల ఆస్తులు ఎక్కడివంటూ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమ ద్రోహుల భరతం పడతామని, అక్రమంగా సంపాదించుకున్న వారిని వదిలిపట్టే ప్రసక్తి లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నూనె ముంతల విమల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి, తాహశీల్దార్ శేషగిరిరావు, ఎంపీడీవో శంకరయ్య, సింగిల్ విండో చైర్మన్ నిరంజన్ రెడ్డి, సర్పంచ్ మేకల మేరీ ఆనంద్ ఆయా గ్రామాల సర్పంచ్లు బాలశౌరి, రమేష్, సోమనారాయణ, అంబేద్కర్, లింగస్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు విద్యాసాగర్, సోమయ్య కాంగ్రెస్ నాయకులు జోజి, సైదులు, సత్యనారాయణ, సోమిరెడ్డి, రమేష్, రవీందర్ రావు, నరేష్, రాజశేఖర్ రెడ్డి, వెంకటేష్, చిత్తలూరు రవీందర్ ఉమేష్  ఆయా మండలాల మండల పార్టీ అధ్యక్షులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.