BREAKING
ఆస్కార్ రేసులోకి మరాఠీ థ్రిల్లర్ 'గొంధల్'... భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీ వినాయక నిమజ్జనంలో విషాదం.. చిన్నారి మృతి పట్ల మంత్రి సత్యకుమార్ యాదవ్ దిగ్భ్రాంతి చిన్నారి కుటుంబానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్ ద్వారా పరామర్శ… నీరు లేక చెరువులో వినాయకుని వదిలి వెళ్ళిన నిర్వహకులు *ప్రారంభానికి నోచుకోని ఆటోమేటిక్ వే బ్రిడ్జి* చిట్యాల - మేజర్ న్యూస్ బాక్సాఫీస్ వద్ద మమితా బైజు సరికొత్త చరిత్ర... రూ. 300 కోట్ల క్లబ్‌లో 'బెత్లహెం కుటుంబ యూనిట్' దేశంలోకి డెంగీ వ్యాక్సిన్ వచ్చేస్తోంది... త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి టీకా బీసీ జనాభాను తక్కువ చేసి చూపే కుట్ర జరుగుతోంది.. కేంద్రంపై కల్వకుంట్ల కవిత ధ్వజం భ్రమరాంబిక అమ్మవారికి మూడు తులాల బంగారు నెక్లెస్ సమర్పణ బిగ్‌బాస్ హౌస్‌లో రసవత్తరంగా కెప్టెన్సీ పోరు - షాలిని వర్సెస్ వర్షిణి మధ్య మాటల యుద్ధం గణిత శాస్త్రంలో కందుల రజనికి పీహెచ్.డీ. వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి.. అన్న జగన్‌ను ఆహ్వానించేందుకు బెంగళూరుకు వెళ్లనున్న షర్మిల ఘనంగా ఓ నా సిద్ధయ్య సాంగ్ టైటిల్ పోస్టర్ లాంచ్ - ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ అందజేసిన సిద్ధు రెడ్డి నెస్ట్ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి. దానం నాగేందర్‌కు హైకోర్టులో చుక్కెదురు.. అనర్హత పిటిషన్లపై విచారణకు ఆదేశం వివిధ శాఖలలో జరుగుతున్న అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి*

నెస్ట్ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి.

Select Suryaa Now
నెస్ట్ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి.

నెస్ట్ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి.

అమీన్‌పూర్, ... జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి  బి. సౌజన్య  శుక్రవారం అమీన్‌పూర్‌లోని శ్రీవాణి నగర్‌లో ఉన్న నెస్ట్ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులతో ఆమె ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధాశ్రమంలో వారికి అందుతున్న వసతులు, ఆహారం, వైద్య సదుపాయాలు, పరిశుభ్రత, భద్రత, తదితర అంశాలను పరిశీలించారు.వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధుల అవసరాలు, సమస్యలను అడిగి తెలుసుకొని, వారికి అవసరమైన న్యాయపరమైన సహాయం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించారు. వృద్ధుల హక్కుల పరిరక్షణకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందుబాటులో ఉంటుందని తెలిపారు.వృద్ధులను గౌరవించడం, వారి పట్ల ప్రేమాభిమానాలతో వ్యవహరించడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఆమె పేర్కొన్నారు. వృద్ధులు తమకు ఎదురయ్యే ఏవైనా న్యాయపరమైన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు.అలాగే వృద్ధాశ్రమంలో వృద్ధులకు అందుతున్న సేవలను నిరంతరం పర్యవేక్షిస్తూ, వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం నిర్వాహకులు, సిబ్బంది, ఇతరులు పాల్గొన్నారు.