గణిత శాస్త్రంలో కందుల రజనికి పీహెచ్.డీ.
గణిత శాస్త్రంలో కందుల రజనికి పీహెచ్.డీ.
పటాన్ చెరు ; గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని కందుల రజని డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘సమీప బీజగణితాలలో రఫ్ సెట్ల సిద్ధాంతానికి చేసిన కృషి’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ గణిత శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి. నరసింహస్వామి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.అనిశ్చితి, అసంపూర్ణ సమాచారాన్ని పరిష్కరించడంలో, డాక్టర్ రజని పరిశోధన రఫ్ సెట్ సిద్ధాంతం, సమీజ బీజగణిత నిర్మాణాల అధ్యయనాన్ని ముందుకు తీసుకువెళ్తుందని తెలియజేశారు. ఆమె కృషి రఫ్ సమీప బీజగణితాల భావనను పరిచయం చేస్తుందని, రఫ్ ఐడియల్స్, రఫ్ సబ్ స్ట్రక్చర్లు, వాటి బీజగణిత ధర్మాలు, పరస్పర సంబంధాలను పరిశీలిస్తుందని వివరించారు. ఇది అనిశ్చితిలో బీజగణిత నిర్మాణాలను అన్వేషించడానికి ఒక చట్రాన్ని అందిస్తుందన్నారు.ఆమె చేసిన గణనీయమైన పరిశోధన కృషి, ఆమె అకడమిక్ నైపుణ్యాన్ని, గణిత పరిజ్జానాన్ని అభివృద్ధి చేయాలనే ఆమె నిబద్ధతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. దీనిని అనుబంధ రంగాలలో కూడా వినియోగించే అవకాశం ఉందన్నారు.డాక్టర్ రజని సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం.రెజా, గణిత, గణాంక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జాదవ్ గణేష్, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు, ఈ విశిష్ట విద్యా సాధనకు, గణిత శాస్త్ర రంగానికి ఆమె చేసిన విలువైన కృషిని అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.