BREAKING
లైసెన్స్ మద్యం షాప్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించిన ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులు..... పడారుపల్లి పీహెచ్‌సీలో పోషణ కార్యక్రమం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ నెల్లూరు సీడీపీఓ టి. అరుణ దేశంలో చారిత్రాత్మక అక్షరాస్యత ప్రగతి పెదభోగిల లో " ఇంటింటికి మన్యం పోలీస్ " పలు అంగన్వాడి కేంద్రాల్లో పోషణ మాసం మహోత్సవాల కార్యక్రమం,ఐ సి డి ఎస్ రంగనాయకులపేట సెక్టర్ సూపర్వైజర్ కే.విజయలక్ష్మి ఎన్నికల సమయంలో సమస్యాత్మక వార్డుల్లో ప్రత్యేక నిఘా ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ల విద్యుత్ కేటగిరీ మార్పుపై కృతజ్ఞతలు ప్రపంచ హృదయ దినోత్సవం 2026 పద్మశాలి భవనానికి 2 కోట్ల నిధులు విడుదల బాచేపల్లి తాండ విద్యా కమిటీ చైర్మన్గా కృష్ణ నాయక్ ఎస్జీఎఫ్‌ అండర్‌-19కు అనంతపురం యువ క్రీడాకారుల ఎంపిక గ్రామీణ ఉపాధి రంగానికి సరికొత్త రూపం రైతు సమస్యలపై పీఏసీఎస్‌ గళం అంగన్వాడీ సేవలు గర్భిణీలు, బాలింతలు సద్వినియోగించుకోవాలి హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్‌యే విశ్వసనీయ భాగస్వామి

స్థానిక ఎన్నికలకు వైసీపీ సిద్ధం.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Select Suryaa Now
స్థానిక ఎన్నికలకు వైసీపీ సిద్ధం.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

స్థానిక ఎన్నికలకు వైసీపీ సిద్ధం.. పెద్దిరెడ్డి 
కర్నూలు, సూర్య ప్రతినిధి 
ముందున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి ఆ పార్టీ కర్నూలు జిల్లా పరిశీలకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉమ్మడి కర్నూల్ వైకాపా పార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని నియోజకవర్గాల కన్వీనర్లు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని  కర్నూలు జిల్లా పార్టీ పరిశీలకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతల సమావేశంలో వైకాపా జిల్లా అధ్యక్షులు ఎస్పీ మోహన్ రెడ్డి పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక  లు మాట్లాడుతూ 
క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి, అన్ని స్థానాల్లో బలంగా పోటీ చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అక్రమ కేసులు, వేధింపులతో పార్టీ శ్రేణులను అణచివేయాలని చూస్తే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, పోలీసు వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరారు.