డివిపల్లిలో రేపు ఉచిత వైద్య శిబిరం
డివిపల్లిలో రేపు ఉచిత వైద్య శిబిరం
- ఎముకలు, కీళ్ల సమస్యలకు వైద్య పరీక్షలు
- డాక్టర్ మల్లికార్జున రెడ్డి
సూర్య ప్రతినిధి,పామూరు :
పామూరు మండలంలోని డివిపల్లి గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు రవణమ్మ మెమోరియల్ మల్లికార్జున రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పొలిమేర మల్లికార్జున రెడ్డి తెలిపారు. ఈ శిబిరంలో ఎముకలు, కీళ్ల సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ మల్లికార్జున రెడ్డి కోరారు.