దసరా భక్తులకు హెల్పింగ్ హాండ్స్ ద్వారా పాలు పంపిణీ
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఇంద్రకీలాద్రికి విచ్చేస్తున్న భక్తులకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో హెల్పింగ్ హాండ్స్ సంస్థ ద్వారా పాలు పంపిణీ చేస్తున్నారు. ఘాట్ రోడ్డు మీదుగా కొండపైకి చేరుకుని క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు పాలు అందిస్తూ సేవలందిస్తున్నారు. భక్తులకు విస్తృత సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించడంలో భాగంగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉత్సవాల తొలి రోజు నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు భక్తులకు పాలు పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది.