భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం
వెంకన్న భక్తుల సౌకర్యాల కల్పనే లక్ష్యం
ఆత్రేయపురం మేజర్ న్యూస్ కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాల కల్పనే లక్ష్యంగా పనులు చైర్మన్ ముదునూరు వెంకటరాజు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు లు అన్నారు ఆలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను నిత్యాన్నదాన పథకం పనితీరును పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయానికి భక్తులు తాకిడి ఎక్కువగా ఉన్నందున వారికి తగ్గ వసతులు కల్పించేందుకు ప్రతిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు మంగళవారం అష్టోత్తరం కళ్యాణం చేయించుకునే భక్తులతో ఆలయ ప్రాంగణమంతా గోవింద నామ స్మరణతో ప్రతిధ్వనించింది వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ అనంతరం అన్నదానం నిర్వహించారు