|
|
by Suryaa Desk | Sat, Sep 13, 2025, 04:48 PM
హైదరాబాద్ వాసులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. నగర అభివృద్ధి, ప్రజల సౌలభ్యం దృష్ట్యా హైదరాబాద్ చుట్టూ మూడు భారీ రైల్వే టెర్మినల్స్ నిర్మించేందుకు కేంద్ర రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రతిపాదనలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి, ప్రాథమిక స్థాయిలో ఆమోదం పొందినట్లు సమాచారం.
ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆధునీకరణ పనులు జరుగుతున్నా, అది నగరంలోని ప్రయాణికుల పెరుగుతున్న డిమాండ్‌కు సరిపడట్లేదు. ముఖ్యంగా హైదరాబాద్ శివారులో నివసించే ప్రజలకు స్టేషన్‌కు చేరుకోవడం కష్టసాధ్యమవుతోంది. ఒకటిన్నర గంట వరకు ప్రయాణం చేయాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, నగర శివారుల్లో మూడు కొత్త రైల్వే టెర్మినల్స్‌ను అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించుకుంది. వీటి ద్వారా ప్రయాణీకుల రద్దీ తగ్గి, ప్రయాణాలు వేగవంతం కానున్నాయి. కొత్త టెర్మినల్స్ ద్వారా నగరానికి అన్ని దిశల నుండి మంచి రైల్వే కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది.
ఈ ప్రాజెక్ట్‌ల అమలుతో రాబోయే రోజుల్లో రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రైల్వే శాఖ తీసుకుంటున్న ఈ అడుగు హైదరాబాద్‌ను మల్టీ-మోడల్ ట్రాన్సిట్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ముందడుగు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ప్రాజెక్టులకు భూముల ఎంపిక, టెండర్లు మొదలయ్యే అవకాశం ఉంది.