సెప్టెంబర్‌లో సదరం శిబిరాలు
సూర్య రాజన్న సిరిసిల్ల ఆగస్టు 29: రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సెప్టెంబర్ 2026లో దివ్యాంగుల కోసం సదరం శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. కంటిచూపు, వినికిడి, మానసిక, ఆర్థో తదితర వైకల్యాలకు సంబంధించి నిర్ణీత తేదీల్లో శిబిరాలు జరుగనున్నాయి.
శిబిరాలకు హాజరయ్యే దివ్యాంగులు మెడికల్ డాక్యుమెంట్లు, ఎక్స్‌రేలు, UDID దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఫోన్ నంబర్ వెంట తీసుకురావాలని సూచించారు. ఉదయం 9 గంటలకు శిబిరానికి హాజరుకావాలని తెలిపారు. శిబిరాల తేదీలకు సంబంధించి మండల అభివృద్ధి అధికారులు, సిరిసిల్ల–వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ప్రజలకు సమాచారం అందించాలని కోరారు.