ఓటరు జాబితాపై రీ-వెరిఫికేషన్..
సూర్య - పెద్దపల్లి రూరల్ :ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియలో భాగంగా విడుదల చేసిన ఓటరు జాబితాలో ఓటర్లుగా నమోదు కాని వారి వివరాల రీ-వెరిఫికేషన్‌కు మండలం లోని పెద్దకల్వల గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద శనివారం ప్రత్యేక విచారణ నిర్వహించారు. జాబితాలో పేర్లు నమోదు కాని అర్హులైన ఓటర్ల వివరాలను పరిశీలించి, సంబంధిత రికార్డులను సేకరించే ప్రక్రియ చేపట్టారు.
ఈ కార్యక్రమాన్ని పెద్దపల్లి తహశీల్దార్ రాజయ్య పరిశీలించారు.
అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా రీ-వెరిఫికేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్ల కనకమ్మ పోలురాజు, ఉపసర్పంచ్ పర్స లక్ష్మి శంకర్, జీపీఓ కోటేష్, వార్డు సభ్యులు, బీఎల్‌ఓలు, గ్రామ ప్రజలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.