BREAKING
క్రీడలతో మానసిక ఉల్లాసం.. శారీరక దారుఢ్యం ఓటరు జాబితాపై రీ-వెరిఫికేషన్.. హైదరాబాద్‌లో ఇక రాత్రివేళ ప్రయాణం ఈజీ.. నైట్ బస్సులకు గ్రీన్ సిగ్నల్! ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వెంటిలేటర్ అంబులెన్స్ సేవలు ప్రారంభం రసాయన శాస్త్రంలో కిరణ్ కుమార్ కు పీహెచ్.డీ.... దేశవ్యాప్తంగా నేడు జాతీయ క్రీడా దినోత్సవం.. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళి! J అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి చార్మినార్ బస్‌స్టాండ్‌ వద్ద తెల్లవారుజామున మంటలు.. అసలేం జరిగిందంటే? డంప్‌యార్డ్‌ను వెంటనే తరలించాలి కొండాపూర్‌లో డిజిటల్ క్రాప్ సర్వే తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. మళ్లీ మారనున్న వాతావరణం! 900 గజాలు-200 రకాలకు పైగా మొక్కలు,చెట్లు ఇది వల్లభనేని కుమార స్వామి ఘనత బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు డేట్ ఫిక్స్.. కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్‌గా అదిరిపోయే అనౌన్స్‌మెంట్! ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌కు బిగ్ షాక్.. పార్టీ నుంచి బహిష్కరణ! కార్పొరేట్ రుణ పరిష్కారాలు.. బ్యాంకింగ్ సంక్షోభంపై పెరుగుతున్న ప్రజా చర్చ

హైదరాబాద్‌లో ఇక రాత్రివేళ ప్రయాణం ఈజీ.. నైట్ బస్సులకు గ్రీన్ సిగ్నల్!

Select Suryaa Now
హైదరాబాద్‌లో ఇక రాత్రివేళ ప్రయాణం ఈజీ.. నైట్ బస్సులకు గ్రీన్ సిగ్నల్!

రాత్రి ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్
హైదరాబాద్‌: నగరవాసులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాత్రివేళల్లో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, ఐటీ సిబ్బంది, హాస్పిటల్‌, హోటల్‌ రంగాల్లో పనిచేసే వారికి ఊరటనిచ్చేలా నైట్ బస్ సర్వీసులను ప్రారంభించింది. ఆగస్టు 29 నుంచి తొలి దశలో ఆరు ప్రధాన మార్గాల్లో ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.

రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు..

కొత్త నైట్ బస్ సర్వీసులు ప్రధానంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల రద్దీని బట్టి కొన్ని మార్గాల్లో 30 నిమిషాల నుంచి గంట వ్యవధిలో బస్సులు నడపాలని TGSRTC నిర్ణయించింది.

ఆరు కీలక రూట్లలో సేవలు

తొలి దశలో 10H, 290U, కోటి–పటాన్‌చెరు, 222A, 219, 195W మార్గాలను నైట్ బస్ సర్వీసులకు ఎంపిక చేశారు. సికింద్రాబాద్‌, హైటెక్ సిటీ, కొండాపూర్‌, కోటి, పటాన్‌చెరు, బాచుపల్లి, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాలకు రాత్రివేళ ప్రయాణికులకు ఈ సేవలు ఉపయోగపడనున్నాయి.

ఐటీ ఉద్యోగులకు భారీ ఊరట

హైదరాబాద్‌లో ఐటీ, హాస్పిటాలిటీ, హోటల్‌ రంగాలు రాత్రివేళల్లోనూ కొనసాగుతున్నాయి. దీంతో అర్ధరాత్రి విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే ఉద్యోగులకు ప్రజా రవాణా కొరత ఎదురవుతోంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని నైట్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ప్రయాణికుల స్పందనపై తదుపరి నిర్ణయం

ప్రస్తుతం ఆరు మార్గాల్లో ప్రారంభించిన సేవలకు వచ్చే స్పందనను TGSRTC పరిశీలించనుంది. ప్రయాణికుల డిమాండ్ పెరిగితే మరిన్ని రూట్లకు నైట్ బస్ సేవలను విస్తరించే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్‌లో రాత్రివేళ ప్రజా రవాణా మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.