ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వెంటిలేటర్ అంబులెన్స్ సేవలు ప్రారంభం
లక్షెట్టిపేట :ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వెంటిలేటర్ అంబులెన్స్ సేవలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను మెరుగైన వైద్యం అందించే ఆసుపత్రికి సురక్షితంగా తరలించేందుకు ఈ వెంటిలేటర్ అంబులెన్స్ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు..
పేద, సామాన్య ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమం ప్రజల ఆరోగ్య భద్రతకు మరింత భరోసా కల్పిస్తుందని తెలిపారు.. అనంతరం హాస్పిటల్ ను సందర్శించి, వైద్యులతో మాట్లాడి పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు..
ఈ కార్యక్రమంలో డాక్టర్లు , సంబంధిత అధికారులు, మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..