కొండాపూర్‌లో డిజిటల్ క్రాప్ సర్వే
రైతుల పొలాల వద్దకు వాలంటీర్లు.. పంట వివరాల డిజిటల్ నమోదు
జియో ట్యాగింగ్‌తో ఖచ్చితమైన సమాచారం.. రైతులు సహకరించాలి : ఈఓ గణేశ్
సంగారెడ్డి మేజర్ న్యూస్ ప్రతినిధి....కొండాపూర్ మండలంలో డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని రైతుల పొలాలను వాలంటీర్లు క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ పంటల వివరాలను మొబైల్ యాప్ ద్వారా నమోదు చేస్తున్నారు.సాగు విస్తీర్ణం, పంట రకం, సాగు పరిస్థితులు తదితర వివరాలను పరిశీలించి జియో ట్యాగింగ్‌తో డిజిటల్‌గా నమోదు చేస్తున్నట్లు ఈఓ గణేశ్ తెలిపారు. ప్రతి రైతు సాగు చేస్తున్న పంటకు సంబంధించిన వివరాలు ఖచ్చితంగా నమోదైతే భవిష్యత్‌లో ప్రభుత్వ పథకాల అమలు, పంటల ప్రణాళిక, వ్యవసాయ విధానాల రూపకల్పనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
రైతులు పూర్తి వివరాలు అందించాలి..
రైతుల పొలాల వద్దకు వచ్చే డిజిటల్ క్రాప్ సర్వే వాలంటీర్లకు రైతులు అవసరమైన సమాచారాన్ని అందించి సర్వే ప్రక్రియకు సహకరించాలని ఈఓ గణేశ్ కోరారు. పంటల వివరాల నమోదు విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, తమ పొలాల్లో సాగు చేస్తున్న పంటలను సిబ్బందికి తెలియజేయాలని సూచించారు.ఈ కార్యక్రమం ద్వారా మండలంలో సాగు విస్తీర్ణం, వివిధ పంటల సాగు పరిస్థితులపై ఖచ్చితమైన డిజిటల్ సమాచారం అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు.