telanagana
శాతవాహన విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో MCAలో స్పాట్ అడ్మిషన్లు
శాతవాహన విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో MCAలో స్పాట్ అడ్మిషన్లు
సూర్య కరీంనగర్
శాతవాహన విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి MCA ప్రోగ్రామ్‌లో స్పాట్ అడ్మిషన్లు సెప్టెంబర్ 2న నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రమాకాంత్ తెలిపారు.TGICET–2026లో అర్హత సాధించిన, సాధించని అభ్యర్థులు, MCAలో ప్రవేశం పొందని వారు ఈ స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు, అవసరమైన ఫీజు వెంట తీసుకురావాలని సూచించారు.స్పాట్ అడ్మిషన్లు సెప్టెంబర్ 2న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శాతవాహన విశ్వవిద్యాలయ సైన్స్ కళాశాలలో జరుగుతాయని తెలిపారు. తుది ఖాళీలు, మార్గదర్శకాలను TGCHE వెబ్‌సైట్, విశ్వవిద్యాలయ నోటీస్ బోర్డులో పరిశీలించవచ్చన్నారు.
మరిన్ని వివరాలకు: 7207777664 సంప్రదించాలని డాక్టర్ ఎస్. రమాకాంత్ తెలిపారు.