BREAKING
ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నేపాల్ వరదల్లో హైదరాబాద్ టెకీ మిస్సింగ్.. చివరి కాల్ తర్వాత కుటుంబంలో తీవ్ర ఆందోళన! సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేయాలి సింగరేణి నుంచి బంగారు వేటకు బిగ్ ప్లాన్.. హట్టి గోల్డ్ మైన్స్‌తో జాయింట్ వెంచర్‌పై ఫోకస్! LoC సమీపంలో అనుమానాస్పద డ్రోన్ల కదలికలు.. అప్రమత్తమైన భద్రతా బలగాలు లక్షెట్టిపేట కేంద్రంగా జనసేన బలోపేతానికి కార్యాచరణ శాతవాహన విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో MCAలో స్పాట్ అడ్మిషన్లు సెప్టెంబర్‌లో సదరం శిబిరాలు క్రీడలతో మానసిక ఉల్లాసం.. శారీరక దారుఢ్యం ఓటరు జాబితాపై రీ-వెరిఫికేషన్.. హైదరాబాద్‌లో ఇక రాత్రివేళ ప్రయాణం ఈజీ.. నైట్ బస్సులకు గ్రీన్ సిగ్నల్! ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వెంటిలేటర్ అంబులెన్స్ సేవలు ప్రారంభం రసాయన శాస్త్రంలో కిరణ్ కుమార్ కు పీహెచ్.డీ.... దేశవ్యాప్తంగా నేడు జాతీయ క్రీడా దినోత్సవం.. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళి! J అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

LoC సమీపంలో అనుమానాస్పద డ్రోన్ల కదలికలు.. అప్రమత్తమైన భద్రతా బలగాలు

Select Suryaa Now
LoC సమీపంలో అనుమానాస్పద డ్రోన్ల కదలికలు.. అప్రమత్తమైన భద్రతా బలగాలు

జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (LoC) సమీపంలో అనుమానాస్పద డ్రోన్లు కనిపించడం కలకలం రేపింది. రాజౌరి ప్రాంతంలో డ్రోన్ల కదలికలను గుర్తించినట్లు సమాచారం. దీంతో భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి.

డ్రోన్ల కదలికలపై సమాచారం అందిన వెంటనే సంబంధిత ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానాస్పద వస్తువులు లేదా ఇతర ఆధారాల కోసం భద్రతా సిబ్బంది పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.

LoC సమీపంలో డ్రోన్ల కదలికలు కనిపించడంతో ఎలాంటి ముప్పు ఉందన్న కోణంలోనూ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటి ఉద్దేశం ఏమిటన్న అంశాలపై భద్రతా సంస్థలు ఆరా తీస్తున్నాయి.

ప్రస్తుతం రాజౌరి ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు అధికారులు వెల్లడించాల్సి ఉంది.