సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేయాలి
సూర్య కోనరావుపేట: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేదలకు చేరేలా గ్రామ కాంగ్రెస్ శాఖలు కీలకంగా పనిచేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. శనివారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మానుక సత్యం ఆధ్వర్యంలో 28 గ్రామాల శాఖ అధ్యక్షులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆది శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా నియమితులైన వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి షేక్ ఫిరోజ్ పాషా, గ్రామ శాఖల అధ్యక్షులు పాల్గొన్నారు.