BREAKING
వారం రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభించాలి. నేపాల్ వరదల్లో చిక్కుకున్న 28 మంది ఏపీ యాత్రికులు సేఫ్.. ఊపిరి పీల్చుకున్న కుటుంబాలు! ఎస్‌ఐఆర్‌ నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నేపాల్ వరదల్లో హైదరాబాద్ టెకీ మిస్సింగ్.. చివరి కాల్ తర్వాత కుటుంబంలో తీవ్ర ఆందోళన! సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేయాలి సింగరేణి నుంచి బంగారు వేటకు బిగ్ ప్లాన్.. హట్టి గోల్డ్ మైన్స్‌తో జాయింట్ వెంచర్‌పై ఫోకస్! LoC సమీపంలో అనుమానాస్పద డ్రోన్ల కదలికలు.. అప్రమత్తమైన భద్రతా బలగాలు లక్షెట్టిపేట కేంద్రంగా జనసేన బలోపేతానికి కార్యాచరణ శాతవాహన విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో MCAలో స్పాట్ అడ్మిషన్లు సెప్టెంబర్‌లో సదరం శిబిరాలు క్రీడలతో మానసిక ఉల్లాసం.. శారీరక దారుఢ్యం ఓటరు జాబితాపై రీ-వెరిఫికేషన్.. హైదరాబాద్‌లో ఇక రాత్రివేళ ప్రయాణం ఈజీ.. నైట్ బస్సులకు గ్రీన్ సిగ్నల్! ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వెంటిలేటర్ అంబులెన్స్ సేవలు ప్రారంభం

ఎస్‌ఐఆర్‌ నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలి

Select Suryaa Now
ఎస్‌ఐఆర్‌ నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలి

ఎస్‌ఐఆర్‌ నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలి.

సంగారెడ్డి, మేజర్ న్యూస్ ప్రతినిధి: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్‌ కాని, అనామలీస్‌ జాబితాలో ఉన్న ఓటర్లకు నోటీసుల పంపిణీని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించి ప్రతిరోజూ నోటీసుల పంపిణీ పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు. నోటీసులు అందజేసిన అనంతరం తప్పనిసరిగా అక్నాలెడ్జ్‌మెంట్‌ పొందాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌ నుంచి ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గాల వారీగా ఎస్‌ఐఆర్‌ పురోగతిని సమీక్షించారు. పెండింగ్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, మిగిలిన నోటీసుల పంపిణీని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఓటరుకు ఇబ్బంది కలగకుండా, ఎన్నికల నిబంధనల మేరకు పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంగీత, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, తహసీల్దార్లు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.