వారం రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభించాలి.
వారం రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభించాలి.
నందగోకుల్ నుంచి చెల్మెడ కమాన్ వరకు 8 కి.మీ. పాదయాత్ర
రామాయంపేట, మేజర్ న్యూస్..: నందగోకుల్–నస్కల్–చెల్మెడ కమాన్ రహదారి పనులు నిలిచిపోవడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి నేతృత్వంలో శనివారం భారీ పాదయాత్ర నిర్వహించారు. నందగోకుల్ నుంచి చెల్మెడ కమాన్ వరకు సుమారు 8 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ రహదారి పనులకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరైనా, బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. రహదారి అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.వారం రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభించాలని, లేకపోతే ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రహదారి పూర్తయ్యే వరకు ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి రహదారి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.