త్రిబుల్ ఆర్ భూసేకరణలో మెదక్ జిల్లా ఉత్తమ పనితీరు..
త్రిబుల్ ఆర్ భూసేకరణలో మెదక్ జిల్లా ఉత్తమ పనితీరు..
మెదక్, మేజర్ న్యూస్ ప్రతినిధి....రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణలో మెదక్ జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆర్‌అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శి గంగాధర్ ఐఏఎస్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధ్యక్షతన రెవెన్యూ, నేషనల్ హైవే అధికారులతో భూసేకరణపై సమీక్ష నిర్వహించారు.భూసేకరణ పురోగతిని అధికారులు వివరించారు. అవార్డు పాస్ అయిన భూముల వివరాలను పోర్టల్‌లో నమోదు చేసి, రైతులకు పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని గంగాధర్ సూచించారు. ఇతర జిల్లాలతో పోలిస్తే మెదక్ జిల్లాలో భూసేకరణ మంచి పురోగతిలో ఉందని ప్రశంసించారు.జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ భూసేకరణలో పారదర్శకత పాటిస్తూ, అవార్డు పాస్ అయిన భూములకు త్వరగా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భూసేకరణ పూర్తయితే ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణ పనులు వేగవంతమవుతాయని పేర్కొన్నారు.సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్, నేషనల్ హైవే పీడీ మాధవి, నర్సాపూర్, తూప్రాన్ ఆర్డీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.