BREAKING
కరువు మండలాలను వెంటనే ప్రకటించి రైతులకు న్యాయం చేయాలి జగన్‌ కుటుంబానికి కేటీఆర్‌ ఆర్థిక భరోసా పూర్తికాకముందే కోట్ పల్లి ప్రాజెక్టు కాలువలకు బీటలు..! రాష్ట్రంలోనే మొదటి స్థానం…మోడల్ గ్రామంగా జి.భీమవరం. వంతెన శితిలాల్లో.. దొంగలు పడ్డారు సౌదీ, హౌతీల మధ్య తీవ్రమైన దాడులు అమెరికా, ఇరాన్‌ల నేరాలపై ఆధారాలు లభ్యం 30 లక్షల మంది నమోదుతో ‘పీఎం విశ్వకర్మ’ మూడేళ్లు పూర్తి అసంక్రమిత వ్యాధులపై ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చట్టానికి న్యూజిలాండ్ పార్లమెంట్ ఆమోదం అఫ్గానిస్థాన్‌పై భారత్ క్లీన్ స్వీప్ కిష్టాపురం గురుకులంలో టిడి టీకా శిబిరం పరిశీలన శ్రీలంకపై సిరీస్‌ కైవసం చేసుకున్న ఇంగ్లండ్ యూరోపా లీగ్‌లో జువెంటస్ ఘనవిజయం మోడీ జన్మదిన వేడుకల్లో దీపాల వెలుగులు

పూర్తికాకముందే కోట్ పల్లి ప్రాజెక్టు కాలువలకు బీటలు..!

Select Suryaa Now
పూర్తికాకముందే కోట్ పల్లి ప్రాజెక్టు కాలువలకు బీటలు..!


బీటలకు సిమెంట్ పూతలు.. కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యం...?
పనుల నాణ్యతపై అనుమానాలు.. పట్టించుకోని అధికారుల తీరుపై విమర్శలు

పెద్దేముల్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 18):
వికారాబాద్ జిల్లాలోని కోటపల్లి ప్రాజెక్ట్ కాలువల పనుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలువల నిర్మాణ పనులు పూర్తికాకముందే పలుచోట్ల బీటలు ఏర్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. బీటలు ఏర్పడిన ప్రాంతాల్లో వాటిని సిమెంట్‌తో రుద్ది పూతలు పూస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు.కాలువల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిర్మాణం పూర్తికాకముందే బీటలు రావడం, వాటిని శాశ్వతంగా మరమ్మతు చేయకుండా పైపూతలతో సరిచేసే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ నిధులు వృథా అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాణ్యతపై అధికారుల పర్యవేక్షణ ఏది...?

ప్రాజెక్ట్‌ కాలువల పనులను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాల్సి ఉన్నప్పటికీ కాంట్రాక్టర్‌ పనితీరుపై తగిన పర్యవేక్షణ లేదనే విమర్శలు వస్తున్నాయి. పనులు పూర్తయ్యేలోపే నిర్మాణంలో లోపాలు బయటపడటంపై అధికారులు స్పందించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.
కోటపల్లి ప్రాజెక్ట్‌ కాలువల నిర్మాణంలో ఉపయోగించిన మెటీరియల్‌, సిమెంట్‌ నాణ్యత, పనుల అంచనాలు, నిబంధనల ప్రకారం నిర్మాణం జరిగిందా లేదా అనే అంశాలపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సమగ్రంగా తనిఖీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. బీటలు ఏర్పడిన ప్రాంతాలను కేవలం సిమెంట్‌ పూతలతో కాకుండా సాంకేతిక నిపుణుల సూచనల మేరకు నాణ్యమైన శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.