BREAKING
కరువు మండలాలను వెంటనే ప్రకటించి రైతులకు న్యాయం చేయాలి జగన్‌ కుటుంబానికి కేటీఆర్‌ ఆర్థిక భరోసా పూర్తికాకముందే కోట్ పల్లి ప్రాజెక్టు కాలువలకు బీటలు..! రాష్ట్రంలోనే మొదటి స్థానం…మోడల్ గ్రామంగా జి.భీమవరం. వంతెన శితిలాల్లో.. దొంగలు పడ్డారు సౌదీ, హౌతీల మధ్య తీవ్రమైన దాడులు అమెరికా, ఇరాన్‌ల నేరాలపై ఆధారాలు లభ్యం 30 లక్షల మంది నమోదుతో ‘పీఎం విశ్వకర్మ’ మూడేళ్లు పూర్తి అసంక్రమిత వ్యాధులపై ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చట్టానికి న్యూజిలాండ్ పార్లమెంట్ ఆమోదం అఫ్గానిస్థాన్‌పై భారత్ క్లీన్ స్వీప్ కిష్టాపురం గురుకులంలో టిడి టీకా శిబిరం పరిశీలన శ్రీలంకపై సిరీస్‌ కైవసం చేసుకున్న ఇంగ్లండ్ యూరోపా లీగ్‌లో జువెంటస్ ఘనవిజయం మోడీ జన్మదిన వేడుకల్లో దీపాల వెలుగులు

రాష్ట్రంలోనే మొదటి స్థానం…మోడల్ గ్రామంగా జి.భీమవరం.

Select Suryaa Now
రాష్ట్రంలోనే మొదటి స్థానం…మోడల్ గ్రామంగా జి.భీమవరం.

పంచాయతీకి ఐఎస్ఓ  సర్టిఫికెట్ ప్రధానం

అనకాపల్లిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కొణతాల రామకృష్ణ సేవలకు నిదర్శనం.

కశింకోట(అనకాపల్లి), సెప్టెంబర్ 18, మేజర్ న్యూస్: అనకాపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ నేతృత్వంలో కసింకోట మండలం జి.భీమవరం పంచాయతీ మోడల్ గ్రామంగా రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించి అరుదైన ఘనత సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా 3 ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేయగా, అందులో జి.భీమవరం మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, పంచాయతీరాజ్ సెక్రటరీ శ్రీ కృష్ణ తేజ చేతుల మీదుగా జి.భీమవరం పంచాయతీ గ్రామ సెక్రెటరీ నారాయణరావుకి ఐఎస్ఓ సర్టిఫికెట్ ప్రధానం చేశారు. ముఖ్యంగా గ్రామంలో మంచినీటి సరఫరా, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, పారిశుద్ధ్యంతో పాటు ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందే విధంగా కొణతాల రామకృష్ణ నేతృత్వంలో జి.భీమవరం గ్రామం అభివృద్ధి చెందింది. త్వరలో కేంద్ర ప్రభుత్వం నుండి జి.భీమవరం గ్రామానికి కోటి రూపాయల నిధులు మంజూరు కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ మా గ్రామానికి రాష్ట్రంలోనే మొదటి స్థానం వచ్చేందుకు కృషి చేసిన మా ఎమ్మెల్యే శ్రీ కొణతాల రామకృష్ణకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.