BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

కాంగ్రెస్ ప్రభుత్వంలో పేరుకే మంత్రులు

Select Suryaa Now
కాంగ్రెస్ ప్రభుత్వంలో పేరుకే మంత్రులు

సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని విమర్శలు
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై కూటమి పక్షమైన సీపీఐకి చెందిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రులు కేవలం పేరుకే పరిమితమయ్యారని, వారికి ఎలాంటి అధికారాలు లేకుండా పోయాయని విమర్శించారు.

మంత్రులకు తమ స్వంత శాఖల్లో కనీసం నిధులు (ఫండ్స్) సాంక్షన్ చేసే అధికారం కూడా లేకపోవడం శోచనీయం.
ఏ చిన్న పనికి రూపాయి సాంక్షన్ కావాలన్నా మంత్రులు మళ్లీ ఆర్థిక శాఖ మంత్రి చుట్టూ తిరగాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు.

నిధుల విడుదల కాకపోవడంతో రాష్ట్రంలో ఒక్క పని కూడా ముందుకు సాగడం లేదని, బిల్లులు వస్తాయో లేదోనన్న అనుమానంతో ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా పనులు చేయడానికి ముందుకు రావడం లేదని స్పష్టం చేశారు. నిధుల గురించి అడిగితే "డబ్బులు లేవు" అని సమాధానం చెప్తున్నారని.. అసలు నిధులే లేనప్పుడు బడ్జెట్‌లో ఆయా కేటాయింపులు ఎందుకు చూపిస్తున్నారని ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించారు.

ప్రభుత్వం ఇప్పటికైనా తీరు మార్చుకుని, మంత్రులకు అధికారాలు ఇవ్వడంతో పాటు పెండింగ్ పనులను వేగవంతం చేయడానికి నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.