BREAKING
ఈ నెల 26న కౌటిల్య కొలోక్వి నాలుగవ ఎడిషన్ ను ప్రకటించిన కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద క్రిస్టోఫర్ నోలన్ రికార్డుల ప్రభంజనం.. 'డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్' రికార్డును బద్దలుకొట్టిన 'ది ఒడిస్సీ' దిగ్గజ నటుడు అస్రానీకి అక్షయ్ కుమార్ భావోద్వేగ నివాళి.. 'హైవాన్' చిత్రంలో చివరి షాట్ వీడియో వైరల్ మిర్జాపూర్ ది మూవీ బాక్సాఫీస్ ఊచకోత.. మొదటి రోజే 25 కోట్ల వసూళ్లతో రికార్డుల సునామీ కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసనలు… ఆటో కార్మికుల హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ భారీ ఆటో ర్యాలీ… 'సీఎస్ఎస్ షీల్డ్' కార్యక్రమానికి జితేంద్ర సింగ్ మద్దతు యాక్సెస్ అండ్ బెనిఫిట్-షేరింగ్ నిధుల పంపిణీలో రూ. 200 కోట్ల మైలురాయిని దాటిన జాతీయ జీవవైవిధ్య అథారిటీ కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తి, సరఫరా వేగవంతం వడోదరలో ఉత్సాహంగా ఫిట్ ఇండియా, సైక్లోథాన్ పాట్నాలోని మనేర్ దియారా ప్రాంతంలో ప్రవాహ ఉధృతి ఇండోనేషియాలో 200 పైగా విమానాలు రద్దు లండన్ హీత్రూ విమానాశ్రయానికి నిలిచిపోయిన రైళ్లు ఈజిప్టులో డ్రగ్స్ కేసులో 11 మందికి మరణశిక్ష ఇండోర్ మెట్రో ప్రయారిటీ కారిడార్-2 ప్రారంభం ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలు

రోడ్డు కోసం.. బీఆర్‌ఎస్‌ పాదయాత్ర..

Select Suryaa Now
రోడ్డు కోసం.. బీఆర్‌ఎస్‌ పాదయాత్ర..

రోడ్డు కోసం.. బీఆర్‌ఎస్‌ పాదయాత్ర..

వెల్దుర్తి–పిల్లికొట్టాల డబుల్‌ రోడ్డుకు తక్షణమే నిధులు విడుదల చేయాలి..

మంజూరైన నిధులను కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేసింది..

సునీతాలక్ష్మారెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కదిలిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు.. డీఆర్వోకు వినతిపత్రం..

మెదక్ : మెదక్‌ జిల్లా వెల్దుర్తి–పిల్లికొట్టాల మధ్య డబుల్‌ రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజల రవాణా కష్టాలు తీర్చాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం భారీ పాదయాత్ర నిర్వహించారు. నర్సాపూర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మాజీ డిప్యూటీ స్పీకర్‌ ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు శివంపేట మండలం పోతులగూడెం నుంచి కలాన్‌ శెట్టిపల్లి వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి కార్ల ర్యాలీగా మెదక్‌ జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో డీఆర్వో అంబాదాసును కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నర్సాపూర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. వెల్దుర్తి–పిల్లికొట్టాల రహదారి అధ్వానంగా మారడంతో నిత్యం రాకపోకలు సాగించే ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ మార్గంలోని గ్రామాల ప్రజలు విద్య, వైద్యం, వ్యవసాయం, వ్యాపారం తదితర అవసరాల కోసం ఈ రహదారిపైనే ఆధారపడుతున్నారని పేర్కొన్నారు.రహదారి పరిస్థితి అధ్వానంగా ఉండటంతో వర్షాకాలంలో ప్రజల ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయని అన్నారు. డబుల్‌ రోడ్డు నిర్మాణం పూర్తయితే పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. ప్రజల సమస్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.అనంతరం మాజీ డిప్యూటీ స్పీకర్‌ యం. పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని తెలిపారు. వెల్దుర్తి–పిల్లికొట్టాల రహదారి నిర్మాణానికి కూడా నిధులు కేటాయించి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వం మారిన అనంతరం పనులు నిలిచిపోయాయని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మంజూరైన నిధులను రద్దు చేసిందని ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను రాజకీయాలకు అతీతంగా కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. రహదారి నిర్మాణం నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్‌ఎస్‌ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. వెల్దుర్తి–పిల్లికొట్టాల డబుల్‌ రోడ్డు నిర్మాణానికి తక్షణమే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. గతంలో మంజూరైన నిధులను పునరుద్ధరించి రహదారి నిర్మాణ పనులను వేగంగా చేపట్టాలని కోరారు. రహదారి నిర్మాణంతో విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు సహా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.అనంతరం కార్ల ర్యాలీగా మెదక్‌ జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. వెల్దుర్తి–పిల్లికొట్టాల రహదారి ప్రస్తుత పరిస్థితి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను డీఆర్వో దృష్టికి తీసుకెళ్లారు. గతంలో మంజూరైన నిధులను పునరుద్ధరించి డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకొని కలెక్టర్ ద్వారా  ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.రహదారి నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రజల తరఫున ఉద్యమాన్ని కొనసాగిస్తామని బీఆర్‌ఎస్‌ నాయకులు స్పష్టం చేశారు.పోతులగూడెం నుంచి ప్రారంభమైన పాదయాత్రలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.