సౌకర్యాల బాధ్యత నాది.. చదువు బాధ్యత మీది!”
సౌకర్యాల బాధ్యత నాది.. చదువు బాధ్యత మీది!”
విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా
హుస్నాబాద్,; విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో బాల, బాలికల హాస్టళ్ల నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ “సౌకర్యాలు కల్పించే బాధ్యత నాది.. వాటిని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరే బాధ్యత మీది” అని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల వసతి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక హాస్టళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్, ప్రిన్సిపల్ తిరుపతిరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కెడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య తదితరులు పాల్గొన్నారు.