BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

బాలిక సంరక్షణ అందరి బాధ్యత --జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

Select Suryaa Now
బాలిక సంరక్షణ అందరి బాధ్యత  --జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

బాలిక సంరక్షణ అందరి బాధ్యత 
--జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

భేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో  ఘనంగా రాఖీ వేడుకలు నిర్వహించడం జరిగింది.

 మెదక్ ; రాఖీ పౌర్ణమి సందర్భంగా బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టరేట్‌లో రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థినులు జిల్లా కలెక్టర్ తోపాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులకు రాఖీలు కట్టి, బాలికల రక్షణ, విద్య, సమానత్వం మరియు సాధికారతకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలనే సందేశాన్ని అందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ..బాలికల హక్కులు, భద్రత, విద్య  భవిష్యత్ అభివృద్ధికి తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు.బాలికలకు సమాన అవకాశాలు కల్పించడం, వారి విద్యను ప్రోత్సహించడం, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.రాఖీ వేడుకల ద్వారా అన్నాచెల్లెళ్ల అనుబంధంతో పాటు బాలికల భద్రత గౌరవాన్ని కాపాడాలనే సామాజిక బాధ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం  చేయాలన్నారు.కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొని “బాలికలను రక్షిద్దాం – బాలికలను చదివిద్దాం” అనే  సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమా భార్గవి,బాలికలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.