BREAKING
సిద్దిపేట సమీపంలోని దుద్దేడ యోగాలింగ క్షేత్రం: అద్భుత విశేషాలు మరియు రహస్య సొరంగ మార్గాలు హీరో సందీప్ కిషన్ 'సిగ్మా' సినిమా ఆడియో, ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్: అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ రేపు ఆదోనిలో గణనాథుని నిమజ్జనం...!! కరప వారాహి ఆలయం స్వాధీనంపై జనసేన నేత చిక్కాల దొరబాబు భావోద్వేగం: దేవాదాయ శాఖ చర్యలపై ఆవేదన కీసరలో కలకలం: ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గణేష్ మండపంలో మంటలు మార్కెట్లో రికార్డు స్థాయికి మక్కల ధర.. క్వింటా రూ.2,775 పలికిన వైనం! దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద.. భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నమన్ ధీర్! జనాభా సంక్షోభం దిశగా భారత్.. భారీగా తగ్గుతున్న జననాల రేటు! భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం! వంటనూనె దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో కేంద్రం.. పండుగ వేళ సామాన్యులకు ఊరట! పోస్టల్ శాఖలో వేలాది ఉద్యోగాలు.. వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి గడువు! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. నేటి పసిడి లోహం రేట్లు ఎలా ఉన్నాయంటే? తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?

సదాశివపేట పట్టణ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

Select Suryaa Now
సదాశివపేట పట్టణ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

సదాశివపేట పట్టణ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
సదాశివపేట: పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ తెలిపారు. సోమవారం నిర్వహించిన మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, ప్రజా ఆరోగ్యం, మౌలిక వసతులు, సుందరీకరణపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రధాన జంక్షన్ల అభివృద్ధి, ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు, ఎన్.హెచ్-65 బైపాస్ టౌన్ ఎంట్రన్స్ వద్ద భారీ జాతీయ జెండా ఏర్పాటు, వీధి దీపాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఫుట్‌పాత్‌లు, ట్రాఫిక్ సదుపాయాల మెరుగుదలకు చర్యలు చేపట్టనున్నారు. వినాయక నిమజ్జనం, దసరా, బతుకమ్మ పండుగలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.మున్సిపాలిటీలో పనిచేస్తున్న 125 మంది పారిశుద్ధ్య కార్మికులకు రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించేందుకు ఆమోదం తెలిపారు. మరో 105 మంది కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులకు శాశ్వత గుర్తింపు కార్డులు అందించనున్నారు. పారిశుద్ధ్య పరికరాలు, దోమల నివారణ స్ప్రే మెషిన్లు, అదనంగా ఒక జేసీబీ కొనుగోలుకు కూడా జనరల్ బాడీ ఆమోదం తెలిపింది.
సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శివాజీ, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.