BREAKING
ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గణేష్ మండపంలో మంటలు మార్కెట్లో రికార్డు స్థాయికి మక్కల ధర.. క్వింటా రూ.2,775 పలికిన వైనం! దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద.. భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నమన్ ధీర్! జనాభా సంక్షోభం దిశగా భారత్.. భారీగా తగ్గుతున్న జననాల రేటు! భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం! వంటనూనె దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో కేంద్రం.. పండుగ వేళ సామాన్యులకు ఊరట! పోస్టల్ శాఖలో వేలాది ఉద్యోగాలు.. వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి గడువు! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. నేటి పసిడి లోహం రేట్లు ఎలా ఉన్నాయంటే? తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే? పురి బీచ్‌లో సుదర్శన్ పట్నాయక్ అద్భుత సైకత శిల్పం: ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో మహా కుంభాభిషేకానికి ముమ్మర ఏర్పాట్లు: కొన్ని గంటల్లో అంకురార్పణ రష్యాపై అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం: చైనా, భారత్‌ సహా వాణిజ్య భాగస్వాముల టార్గెట్‌గా ఆంక్షల బిల్లు కర్ణాటకలో యాభై లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన తహసీల్దార్ తిరుమలలో ఘనంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు: ధ్వజారోహణంతో ప్రారంభమైన వైభవోత్సవం

22A నిషేధిత భూముల జాబితాపై సిద్దిపేటలో బిజెపి ధర్నా

Select Suryaa Now
22A నిషేధిత భూముల జాబితాపై సిద్దిపేటలో బిజెపి ధర్నా

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రామచందర్ రావు
సిద్దిపేట: భూముల '22A నిషేధిత ఆస్తుల జాబితా' చిక్కుల వల్ల సాధారణ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ (RDO) కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.

తరతరాలుగా సాగు చేసుకుంటున్న అసలైన పట్టాదారుల, పేద రైతుల భూములను కూడా రెవెన్యూ శాఖ అధికారులు '22A నిషేధిత జాబితా'లో చేర్చారని బిజెపి నేతలు ఆరోపించారు. తమ సొంత భూములను అమ్ముకోవడానికి లేదా అత్యవసర అవసరాలకు కుదువ పెట్టుకోవడానికి వీలులేకుండా పోయిందని, అధికారుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ధ్వజమెత్తారు.

నిషేధిత జాబితా పేరుతో ఇబ్బందులు పెడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, వెంటనే రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి అసలైన యజమానులకు భూములపై పూర్తి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ సమస్యకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, బాధిత రైతులకు తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.