BREAKING
అమెరికాతో ఒప్పందానికి ఇరాన్ ఆసక్తి: ట్రంప్ 2030 నాటికి 8 గిగావాట్లకు దేశీయ డేటా సెంటర్ సామర్థ్యం 34.54 కోట్ల మందికి ‘నషా ముక్త్ భారత్’ వ్యర్థ ఉష్ణాన్ని విద్యుత్తుగా మార్చే కొత్త ఆవిష్కరణ 1033 హెల్ప్‌లైన్‌ను అప్‌గ్రేడ్ చేయనున్న ఎన్‌హెచ్‌ఏఐ వడ్డుపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు: ముఖ్య అతిథులుగా మంచో ఫెర్రర్, గడుపూటి నారాయణస్వామి ధర్మవరంలో ఆకట్టుకున్న 1,116 కిలోల గంధం వినాయకుడు దంపతుల అనుమానాస్పద మృతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు పీజీ సీటు రాలేదనే మనోవేదనతో వైద్యుడి మృతి ఢిల్లీలో ఎన్టీఏ కొత్త చిరునామా ఇదే.. కీలక వివరాలు వెల్లడించిన డైరెక్టర్ జనరల్ సింగరేణిలో వేధింపుల ఆరోపణలు.. అప్రెంటిస్‌ యువతి విషాదాంతం… -ఫిర్యాదు చేసినా చర్యలు లేవని కుటుంబ సభ్యుల ఆరోపణలు.. చికిత్స పొందుతూ అక్షిత రాణి మృతి.. వడ్డుపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు: ముఖ్య అతిథులుగా మంచో ఫెర్రర్, గడుపూటి నారాయణస్వామి భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు శ్రీ వర సిద్ధి వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమాలు డిఎఫ్ఎస్ (DFS)కు ‘రాజ్‌భాషా కీర్తి పురస్కారం’

34.54 కోట్ల మందికి ‘నషా ముక్త్ భారత్’

Select Suryaa Now
34.54 కోట్ల మందికి ‘నషా ముక్త్ భారత్’

న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ (NMBA) 34.54 కోట్ల మంది పౌరులకు చేరువైంది. ఇందులో 13.70 కోట్ల మంది యువకులు, 10.64 కోట్ల మంది మహిళలు భాగస్వాములయ్యారు. ఈ ప్రచారంలో భాగంగా ఇప్పటివరకు 31.40 లక్షలకు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, 1.67 లక్షల మంది ‘నషా ముక్తి మిత్రులు’ సేవలందిస్తున్నారని మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాన్ష్ పంత్ తెలిపారు.

బాధితులకు వైద్య సహాయం అందించేందుకు గత రెండేళ్లలో 755కు పైగా కొత్త వ్యసన విముక్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలు సమీపంలోని చికిత్సా కేంద్రాలను గుర్తించేందుకు ‘NMBA 2.0’ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి మరో కోటి మందితో సామూహిక ప్రతిజ్ఞ చేయించనున్నట్లు అధికారులు వెల్లడించారు.