|
|
by Suryaa Desk | Fri, Sep 12, 2025, 04:43 PM
మంచిర్యాల జిల్లాలో పులి సంచారం స్థానికులలో కలకలం రేపింది. జిల్లాలోని జన్నారం మండలంలో శుక్రవారం ఉదయం రహదారిపై పులి కనిపించింది. దీంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సింగరాయపేట- దొంగపెళ్లి రహదారి పక్కన ఉన్న కల్వర్టుపై కూర్చొని గాండ్రిస్తూ కనిపించింది. దీంతో వాహనదారులు కాసేపు అక్కడే ఆగిపోయారు. పులిని తమ ఫోన్లలో బంధించారు. కాసేపటికి పులి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. అయితే, పులి సంచారం నేపథ్యంలో వాహనదారులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరించారు. ఒంటరిగా వెళ్లకూడదని ప్రజలకు సూచించారు. పులిని బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.