శ్రీ నర్మదేశ్వర శివాలయం వార్షికోత్సవం...
01 సూర్య పెద్దపల్లి రూరల్:
మండలంలోని పెద్దకల్వల గ్రామంలోని హనుమాన్‌గుడి ఆవరణలో ఉన్న శ్రీ నర్మదేశ్వర శివాలయ వార్షికోత్సవాన్ని బుధవారం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా రుద్రాభిషేకం, గణపతి పూజ, ప్రత్యేక అభిషేకాలు, మండపారాధన, రుద్రహోమం, గణపతి హోమం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.