సర్కార్ భూములపై అనుముల గద్దలు
* ఫ్యూచర్ సిటీలోని ప్రభుత్వ భూములను పరిశీలించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు
రంగారెడ్డి/ మహేశ్వరం, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 10) : జిహెచ్ఎంసి పరిధిలోని తుక్కుగూడ టెస్సెరాక్ట్ సంస్థ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ నాయకులు గురువారం ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఫోర్త్ సిటీలో టెస్సెరాక్ట్ కంపెనీకి వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కేటాయించారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వ భూముల కేటాయింపుల పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టెస్సెరాక్ట్ కంపెనీకి ఏ హోదాలో, ఏ నిబంధనల ప్రకారం భూములు కేటాయించారో ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని కేటీఆర్ ప్రశ్నించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు టెస్సెరాక్ట్ ప్రాంతాన్ని పరిశీలించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి), పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.