BREAKING
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్.. పిఠాపురం, కాకినాడలో వివిధ కార్యక్రమాలు కోట్లాది రూపాయలతో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం : ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి: దేవభక్తుని చక్రవర్తి ఫైన్లు వేయడం మా ప్రాధాన్యత కాదు.. అవగాహన కల్పించడమే లక్ష్యం భీమవరం సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయం.. కార్తీకమాసంలో దర్శించుకోవాల్సిన పంచారామ క్షేత్రం సేవా పఖ్వాడాలో భాగంగా విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్ రన్’ చామనపల్లి వినాయక మండపాల్లో ఆకుల నరసన్నకు ఘన సన్మానం హిందూ సమాజానికి కులతత్వం, అంటరానితనం మచ్చ: సామాజిక సామరస్యానికి పిలుపు జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యం ఘనంగా యోగా కార్యక్రమం.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసియా క్రీడల్లో రజతం సాధించిన మహిళా షూటర్లకు ప్రధాని మోదీ ప్రశంసలు: దేశానికి గర్వకారణమంటూ అభినందనలు ఆకర్షణీయంగా స్కూల్ యూనిఫారాలు : సీఎం రేవంత్ మంచిర్యాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ

చామనపల్లి వినాయక మండపాల్లో ఆకుల నరసన్నకు ఘన సన్మానం

Select Suryaa Now
చామనపల్లి వినాయక మండపాల్లో ఆకుల నరసన్నకు ఘన సన్మానం

 

భక్తిశ్రద్ధలతో గణనాథుడిని దర్శించుకున్న కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న

 సూర్య కరీంనగర్ ప్రతినిధి::
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు చామనపల్లి గ్రామంలోని వివిధ వినాయక మండపాలను కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న సందర్శించారు. ఆయా మండపాల్లో గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని వినాయక స్వామివారిని ప్రార్థించారు.ఈ కార్యక్రమానికి ఏఎంసీ డైరెక్టర్ చిక్కని కనకయ్య ఆహ్వానం అందించగా, ఆయనతో పాటు చామనపల్లి గ్రామ సర్పంచ్ పోగొండ ఐలన్న, ఉప సర్పంచ్ శ్రీనివాస్, పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు శంకరయ్య, బుర్ర గంగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.అలాగే చామనపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ మండపాల నిర్వాహకులు, గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాల్లో భాగస్వాములయ్యారు.ఈ సందర్భంగా వివిధ వినాయక మండపాల నిర్వాహకులు, కమిటీ సభ్యులు మరియు గ్రామస్థులు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్నను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.అనంతరం ఆకుల నరసన్న భక్తులతో కలిసి వినాయక స్వామివారిని దర్శించుకుని, ఉత్సవాల నిర్వహణ తీరును పరిశీలించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.