BREAKING
రూ.1.55 లక్షలకు గణేశుడి లడ్డూ వేలం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్.. పిఠాపురం, కాకినాడలో వివిధ కార్యక్రమాలు కోట్లాది రూపాయలతో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం : ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి: దేవభక్తుని చక్రవర్తి ఫైన్లు వేయడం మా ప్రాధాన్యత కాదు.. అవగాహన కల్పించడమే లక్ష్యం భీమవరం సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయం.. కార్తీకమాసంలో దర్శించుకోవాల్సిన పంచారామ క్షేత్రం సేవా పఖ్వాడాలో భాగంగా విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్ రన్’ చామనపల్లి వినాయక మండపాల్లో ఆకుల నరసన్నకు ఘన సన్మానం హిందూ సమాజానికి కులతత్వం, అంటరానితనం మచ్చ: సామాజిక సామరస్యానికి పిలుపు జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యం ఘనంగా యోగా కార్యక్రమం.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసియా క్రీడల్లో రజతం సాధించిన మహిళా షూటర్లకు ప్రధాని మోదీ ప్రశంసలు: దేశానికి గర్వకారణమంటూ అభినందనలు ఆకర్షణీయంగా స్కూల్ యూనిఫారాలు : సీఎం రేవంత్

ఫైన్లు వేయడం మా ప్రాధాన్యత కాదు.. అవగాహన కల్పించడమే లక్ష్యం

Select Suryaa Now
ఫైన్లు వేయడం మా ప్రాధాన్యత కాదు.. అవగాహన కల్పించడమే లక్ష్యం

ఫైన్లు వేయడం మా ప్రాధాన్యత కాదు..

అవగాహన కల్పించడమే లక్ష్యం

ప్రమాదాల నివారణకు వినూత్న చర్యలు..

ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు ప్రత్యేక ప్రణాళిక

పెనమలూరు ట్రాఫిక్‌ సీఐ వి.పెద్దిరాజు ప్రత్యేక ఇంటర్వ్యూ

పెనమలూరు, సెప్టెంబర్ 20, మేజర్ న్యూస్ : పెనమలూరు ట్రాఫిక్‌ విభాగం పరిధిలో వాహనాల రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ట్రాఫిక్‌ సీఐ వి.పెద్దిరాజు తెలిపారు. గతంలో గన్నవరం ట్రాఫిక్‌ విభాగంలో విధులు నిర్వహించిన ఆయన.. పెనమలూరు ట్రాఫిక్‌ సీఐగా బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలు పూర్తవుతున్న సందర్భంగా మేజర్‌ న్యూస్‌ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ట్రాఫిక్‌ పరిస్థితులు, ప్రమాదాల నివారణ, డిజిటల్‌ పరీక్షలు, వీఐపీల రాకపోకలు, నంబర్‌ ప్లేట్లు లేని వాహనాలు, అస్త్ర యాప్‌, రోడ్లపై ఆక్రమణలు, సైబర్‌ నేరాలపై ఆయన వివరించారు.

గన్నవరం ట్రాఫిక్‌కు, పెనమలూరు ట్రాఫిక్‌కు ప్రధాన తేడా ఏమిటి?

గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటంతో వీఐపీల రాకపోకలు, గ్రీన్‌ ఛానళ్ల నిర్వహణ ఎక్కువగా ఉంటుంది. పెనమలూరు ట్రాఫిక్‌ విజయవాడ నగరానికి కీలక మార్గం కావడంతో వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయి. కంకిపాడు టోల్‌గేట్‌ నుంచి ఆటోనగర్‌ బస్టాండ్‌ వరకు మా పరిధిలోకి వస్తుంది. మంత్రులు, న్యాయమూర్తులు, ఐపీఎస్‌ అధికారుల రాకపోకలు కూడా ఎక్కువగా ఉంటాయి.

డిజిటల్‌ పరీక్షల సమయంలో ట్రాఫిక్‌ను ఎలా నియంత్రిస్తున్నారు?

మూడు విడతల్లో జరిగే పరీక్షలకు ఒక్కో విడతలో సుమారు 1,500 మంది చొప్పున మొత్తం 4 వేల నుంచి 4,500 మంది విద్యార్థులు వస్తుంటారు. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికతో సిబ్బందిని ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నాం.

శుభకార్యాలు, పార్టీ కార్యక్రమాలు, వీఐపీల రాకపోకల సమయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

ముఖ్యమంత్రి, మంత్రులు, వీఐపీల రాకపోకల సమయంలో విజయవాడ నగర పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నాం. అవసరమైన చోట అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి, పరిస్థితిని బట్టి దారి మళ్లింపులు చేపడుతున్నాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రత్యేక బృందాలు, ఎస్సైలు, సబ్‌ డివిజన్‌ సిబ్బంది అందుబాటులో ఉంటారు. ప్రధాన కూడళ్లలో ఇద్దరు సిబ్బందిని విధుల్లో ఉంచాం.

కృష్ణాజిల్లా ఎస్పీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రోడ్డు ప్రమాదాల్లో ఎలాంటి మార్పు వచ్చింది?

ఎస్పీ వి.విద్యాసాగర్‌ నాయుడు ఆదేశాలతో జిగ్‌జాగ్‌ బారికేడ్లు ఏర్పాటు చేయడం, ప్రమాదాలకు గురైన వాహనాలను ప్రదర్శించడం వంటి చర్యలు చేపట్టాం. దీంతో ప్రమాదాలు తగ్గాయి. సుమారు గతంలో నెలకు 25 వరకు ఉన్న ప్రమాద మరణాలు ప్రస్తుతం 12 నుంచి 13కు తగ్గాయి. ప్రమాదాలు కూడా దాదాపు 50 శాతం తగ్గాయి.

నంబర్‌ ప్లేట్లు లేని వాహనాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

నంబర్‌ ప్లేట్లు లేని వాహనాలను గుర్తించేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాం. ముఖ్యంగా స్పోర్ట్స్‌ బైక్‌లపై దృష్టి పెట్టాం. ఒక్కరోజులో సుమారు 180 వాహనాలను స్వాధీనం చేసుకుని, పత్రాలు, ఆధార్‌ వివరాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం జరిమానాలు విధించిన సందర్భం కూడా ఉంది.

హెల్మెట్‌, సీటుబెల్టు వినియోగంపై ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు?

ప్రతి ఒక్కరూ హెల్మెట్‌, సీటుబెల్టు తప్పనిసరిగా ఉపయోగించేలా నిరంతరం అవగాహన కల్పిస్తున్నాం. రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

ప్రజలకు ఫైన్లు విధించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమా?

ప్రజలకు ఫైన్లు వేయడం మా ప్రాధాన్యత కాదు. ట్రాఫిక్‌ నిబంధనలు ఎందుకు పాటించాలో వివరించి, వారిలో మార్పు తీసుకురావడమే మా లక్ష్యం. తప్పు చేసిన వారికి అవగాహన కల్పించాలని, ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదని ఎస్పీ కూడా సూచిస్తుంటారు.

సిటీ పరిధిలో ఏర్పాటు చేసిన అస్త్ర యాప్‌ తరహా సాంకేతికత ఇక్కడ కూడా అవసరమా?

ట్రాఫిక్‌ సమస్య ఏర్పడిన వెంటనే అధికారులకు సమాచారం అందేలా అస్త్ర యాప్‌ ఉపయోగపడుతోంది. ప్రస్తుతం దీని పరిధి గూడవల్లి నుంచి ఆటోనగర్‌ వరకు ఉంది. గన్నవరం విమానాశ్రయం, పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు టోల్‌గేట్‌ వరకు పరిధిని పెంచే అంశంపై కమిషనర్‌, జిల్లా ఎస్పీ చర్చించారు. త్వరలో అమల్లోకి వస్తుందని ఆశిస్తున్నాం.

ఫుట్‌పాత్‌లు, రోడ్లపై వ్యాపారాలు, ప్రైవేటు పార్కింగ్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

సనత్‌నగర్‌ నుంచి ట్రిపుల్‌ ఆర్‌ సెంటర్‌ వరకు రోడ్డు ఇరుకుగా ఉండటంతో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి వ్యాపారులకు అవగాహన కల్పించాం. రోడ్లపై లారీలు, వాహనాల పార్కింగ్‌ను నియంత్రించేందుకు నో పార్కింగ్‌ బోర్డులు ఏర్పాటు చేశాం. ఆసుపత్రులు, హోటళ్లు, విద్యాసంస్థల వద్ద రోడ్లపై పార్కింగ్‌ చేసే వారికి నోటీసులు జారీ చేస్తున్నాం.

సైబర్‌ నేరాలు, వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ మోసాలపై ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు?

సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌లు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ చెప్పకూడదు. సైబర్‌ బృందం, ఉయ్యూరు టౌన్‌ సీఐ ఆధ్వర్యంలో అవగాహన వీడియోలు రూపొందించి ప్రజలకు చేరువ చేస్తున్నాం.