BREAKING
హిందూ సమాజానికి కులతత్వం, అంటరానితనం మచ్చ: సామాజిక సామరస్యానికి పిలుపు జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యం ఘనంగా యోగా కార్యక్రమం.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసియా క్రీడల్లో రజతం సాధించిన మహిళా షూటర్లకు ప్రధాని మోదీ ప్రశంసలు: దేశానికి గర్వకారణమంటూ అభినందనలు ఆకర్షణీయంగా స్కూల్ యూనిఫారాలు : సీఎం రేవంత్ మంచిర్యాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ తెలంగాణకు భారీ వర్ష సూచన.. మూడు రోజులు అప్రమత్తం బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణకు వర్ష సూచన రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు మేయర్ స్థానం దళితులకు కేటాయించాల్సిందే కేజీబీవీ ఘటనలో బాధ్యులను గుర్తిస్తాం: గంటా నేడు ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌కు శంకుస్థాపన బిజెపి తీర్థం పుచ్చుకున్న కొవ్వాడ మాజీ ఎంపీపీ గోపాలకృష్ణమూర్తి రాజు తెలుగు గజల్ గాన విభావరి ఆక్స్‌ఫర్డ్ టెడ్ ఎక్స్ వేదికపై అదరగొట్టిన గంటా మనవడు: 9 ఏళ్ల జిష్ణు ఆర్యన్ స్ఫూర్తిదాయక ప్రసంగం ఘనంగా 89వ గోతురుత్ బోట్ రేస్: పురాతన సంప్రదాయాన్ని గుర్తుచేసుకున్న కేరళ సీఎం వి.డి. సతీశన్

మేయర్ స్థానం దళితులకు కేటాయించాల్సిందే

Select Suryaa Now
మేయర్ స్థానం దళితులకు కేటాయించాల్సిందే


--జీవీఎంసీ120 వార్డులలో ఎస్సీలకు 19, ఎస్టీలకు 8 వార్డులు కేటాయించాలి 
--రిజర్వేషన్ విధానాన్ని పాటించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకం 
-- రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత బహుజన పార్టీలు, సంఘాల నేతలు  ధ్వజం

సీతమ్మధార సెప్టెంబర్ 20 మేజర్ న్యూస్. ;రాబోవు ఎన్నికల్లో జీవీఎంసీ మేయర్ స్థానం దళితులకు  రిజర్వు చేయాలని పలు దళిత బహుజన పార్టీలు, సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం రామా టాకీస్ రోడ్డులోని అంబేద్కర్ భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. విశాఖపట్నం నగరాన్ని 1979సం.లో మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేశారని, ఈ 47 ఏళ్ల కాలంలో  ఎస్సీలకు మేయర్ స్థానం ఒక్కసారి కూడా రిజర్వ్ చేయలేదని మండిపడ్డారు. ఇంతకుముందు కూడా మున్సిపాలిటీగా ఉన్న కాలంలో ఇదే పరిస్థితిని చెప్పారు.గత సారి 98 వార్డులు ఉండగా ఎస్సీలకు9, ఎస్టీలకు ఒక స్థానాన్ని మాత్రమే  రిజర్వేషన్ కల్పించి రాజ్యాంగ హక్కును తూట్లు పొడిచారని దుయ్యబట్టారు.వార్డుల సంఖ్య ప్రాతిపదికన 15శాతం ఎస్సీలకు, 7 శాతం  ఎస్టీలకు రిజర్వేషన్ కేటాయింపులు జరగాలన్నారు. రిజర్వేషన్ విధానం ప్రకారం ప్రస్తుతం 120 వార్డులలో 19 ఎస్సీలకు, 8 ఎస్టీలకు  రిజర్వ్ చేయాలని డిమాండ్ చేశారు. జీవీఎంసీ పరిధిలో 3.5 లక్షల మంది ఎస్సీలు ఉన్నారని  నగరపాలనకు వారు పనికిరాని ప్రశ్నించారు. ఈ  48 ఏళ్ల కాలంలో అగ్రకులాలు, బీసీలకే మేయర్ పీఠం కల్పించారని, ప్రధాన రాజకీయ పార్టీలు ఈసారి ఆ స్థానం దళితులకు కల్పించి తమ నిజాయితీని నిలుపుకోవాలని హితవు పలికారు. ఈ సమస్యను  రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొని వెళ్తామని తమకు న్యాయం జరగకపోతే ఆందోళన జరుగుతాయని హెచ్చరించారు. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కళ్యాణ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జె. వి. ప్రభాకర్, కోశాధికారి గార సత్యనారాయణ, సహాయ కార్యదర్శి బత్తుల గౌతమ్ బాబు, మాజీ అడిషనల్ ఎస్పీ,బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పి. ప్రకాశరావు, రాష్ట్ర కోశాధికారి శివ ప్రసాద్, ఆర్ పిఐ (అంబేద్కర్ ) ఉత్తరాంధ్ర అధ్యక్షుడు కొంగరపు గణపతి, భారత్ సమాజ్ డెవలప్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు చింతాడ సూర్యం, ఆర్బిఐ రాష్ట్ర కార్యదర్శి కోలా హరిబాబు, డిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చింతా చిట్టి రాజు , బుద్ధిష్టి సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా ఉపాధ్యక్షుడు ,పెయ్యల సిద్ధార్థ,బీఎస్పీ రాష్ట్ర మహిళా కో కన్వీనర్ పెద్దాడ కనకమహాలక్ష్మి,జై ఆంధ్ర, రైల్వే ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్, ప్రతినిధులు పివిఆర్ మోహన్ రావు, బి జగన్నాథరావు, తదితరులు పాల్గొన్నారు.
... 
జె.వి ప్రభాకర్,8309853491