మంచిర్యాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ
తెలంగాణ బ్యూరో, ప్రతినిధి : మంచిర్యాల ప్రజల భద్రత, మెరుగైన రవాణా సౌకర్యం, ప్రాంతాల మధ్య కనెక్టివిటీని దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. చెన్నూరు, చిర్రకుంట, రసూల్‌పల్లి రోడ్డు, ఆదిల్‌పేట్, వెంకటాపూర్, ముదిగుంట ప్రాంతాలకు సంబంధించిన హై లెవల్ బ్రిడ్జిల నిర్మాణం, రోడ్ల వైడెనింగ్, స్ట్రెంగ్థెనింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. సుమారు 16 కిలోమీటర్ల మేర రూ.40 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాల్సిన ఈ అభివృద్ధి పనుల కోసం గత రెండు సంవత్సరాలుగా కేంద్రాన్ని కోరుతున్నామని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ఇప్పటికే మంజూరైన పనులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయనే అంశాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లారు. మంచిర్యాల ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, భద్రత, మెరుగైన కనెక్టివిటీ కోసం నిరంతరం కృషి చేస్తామని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ప్రజల హక్కు కోసం.. మంచిర్యాల అభివృద్ధి కోసం.. నిరంతర కృషి చేస్తానన్నారు .
పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధికి కృషి
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల భద్రత, మెరుగైన కనెక్టివిటీ, మౌలిక వసతుల అభివృద్ధికి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని మొత్తం తొమ్మిది ఆర్ యు బి (వంతెనల కింద రోడ్డు) నిర్మాణ పనులపై రైల్వే అధికారులతో ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేకంగా చర్చించారు. ముఖ్యంగా ఎల్ సి -30, ఎల్ సి -35, ఎల్ సి -37 ప్రాంతాల్లో నేచురల్ డ్రైనేజీ సౌకర్యం అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే మంజూరైన ఆర్ యు బి (వంతెనల కింద రోడ్డు) లు మరియు అప్రోచ్ రోడ్ల పనులను వేగవంతం చేసి, ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ అంశంపై రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్పందిస్తూ, తక్షణ చర్యలు తీసుకుంటామని, వచ్చే ఏడాదిలోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ వంశీకృష్ణ తలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని మౌలిక వసతుల పరంగా మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు, ప్రజల అవసరాలకు అనుగుణంగా నిరంతరం కృషి చేస్తామని ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు. ప్రజల భద్రత.. మెరుగైన కనెక్టివిటీ.. అభివృద్ధి దిశగా పెద్దపల్లి ముందుకు వెళుతోందన్నారు .