BREAKING
హిందూ సమాజానికి కులతత్వం, అంటరానితనం మచ్చ: సామాజిక సామరస్యానికి పిలుపు జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యం ఘనంగా యోగా కార్యక్రమం.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసియా క్రీడల్లో రజతం సాధించిన మహిళా షూటర్లకు ప్రధాని మోదీ ప్రశంసలు: దేశానికి గర్వకారణమంటూ అభినందనలు ఆకర్షణీయంగా స్కూల్ యూనిఫారాలు : సీఎం రేవంత్ మంచిర్యాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ తెలంగాణకు భారీ వర్ష సూచన.. మూడు రోజులు అప్రమత్తం బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణకు వర్ష సూచన రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు మేయర్ స్థానం దళితులకు కేటాయించాల్సిందే కేజీబీవీ ఘటనలో బాధ్యులను గుర్తిస్తాం: గంటా నేడు ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌కు శంకుస్థాపన బిజెపి తీర్థం పుచ్చుకున్న కొవ్వాడ మాజీ ఎంపీపీ గోపాలకృష్ణమూర్తి రాజు తెలుగు గజల్ గాన విభావరి ఆక్స్‌ఫర్డ్ టెడ్ ఎక్స్ వేదికపై అదరగొట్టిన గంటా మనవడు: 9 ఏళ్ల జిష్ణు ఆర్యన్ స్ఫూర్తిదాయక ప్రసంగం ఘనంగా 89వ గోతురుత్ బోట్ రేస్: పురాతన సంప్రదాయాన్ని గుర్తుచేసుకున్న కేరళ సీఎం వి.డి. సతీశన్

ఆకర్షణీయంగా స్కూల్ యూనిఫారాలు : సీఎం రేవంత్

Select Suryaa Now
ఆకర్షణీయంగా స్కూల్ యూనిఫారాలు : సీఎం రేవంత్

హైదరాబాద్, సూర్య ప్రతినిధి :విద్యార్థులకు అందించే యూనిఫాం మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. డిజైన్లలో వైవిధ్యానికి ప్రయత్నించాలని చెప్పారు. విద్యార్థులకు అందించే యూనిఫాం, ఇతర సామగ్రి పంపిణీపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 

ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్స్ స్కూల్స్ పిల్లలకు ఒక జత యూనిఫాం పంపిణీ పూర్తయిందని, రెండో జత యూనిఫాంను నెలాఖరులోగా అందజేస్తామని సమావేశంలో  అధికారులు తెలియజేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందజేసినట్లు తెలిపారు. 

 విద్యార్థులందరికీ నోటు పుస్తకాలు పంపిణీ పూర్తయిందన్నారు. ప్రభుత్వ వసతిగృహాలు, రెసిడెన్షియల్స్ స్కూల్స్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలోని విద్యార్థులందరికీ ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్పూన్లు, కప్పులు, కార్పెట్లు, బెడ్‌షీట్లు, టవళ్లు పంపిణీ పూర్తయిందని అధికారులు వివరించారు. 

వచ్చే ఏడాది పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాం, ఇతర సామగ్రి విద్యార్థులకు అందేలా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు అదనంగా 10 శాతం విద్యార్థులు పాఠశాలల్లో చేరే అవకాశం ఉన్నందున, అందుకు తగినట్లు ప్రణాళిక రూపొందించుకోవాల‌ని చెప్పారు. 

ఈ ఏడాది అందించిన యూనిఫాం, ఇత‌ర సామ‌గ్రి నాణ్యతపై తల్లిదండ్రుల నుంచి సంతృప్తి వ్యక్తమైందని అన్నారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి , ఎంపీ వేం నరేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.