BREAKING
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసియా క్రీడల్లో రజతం సాధించిన మహిళా షూటర్లకు ప్రధాని మోదీ ప్రశంసలు: దేశానికి గర్వకారణమంటూ అభినందనలు ఆకర్షణీయంగా స్కూల్ యూనిఫారాలు : సీఎం రేవంత్ మంచిర్యాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ పెండింగ్ రోడ్డు పనులు, హెచ్ ఎల్ బి ల నిర్మాణం కేంద్రం దృష్టికి సమస్యల వివరణ పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధికి కృషి తెలంగాణకు భారీ వర్ష సూచన.. మూడు రోజులు అప్రమత్తం బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణకు వర్ష సూచన రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం సోమవారానికి వాయుగుండంగా, మంగళవారానికి తీవ్ర వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుమ మేయర్ స్థానం దళితులకు కేటాయించాల్సిందే కేజీబీవీ ఘటనలో బాధ్యులను గుర్తిస్తాం: గంటా నేడు ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌కు శంకుస్థాపన అన్ని ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ ప్రాజెక్టులకు సంబంధించిన అలాట్‌మెంట్ లెటర్లు రేపటి నుండి ఎస్ఎంఎస్ వాట్సాప్, టీజీ హెచ్బి వెబ్సైట్ ద్వారా వెబ్‌సైట్ ద్వారా లబ్ధిదారులకు అందజేత గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చే శంకుస్థాపన బిజెపి తీర్థం పుచ్చుకున్న కొవ్వాడ మాజీ ఎంపీపీ గోపాలకృష్ణమూర్తి రాజు తెలుగు గజల్ గాన విభావరి ఆక్స్‌ఫర్డ్ టెడ్ ఎక్స్ వేదికపై అదరగొట్టిన గంటా మనవడు: 9 ఏళ్ల జిష్ణు ఆర్యన్ స్ఫూర్తిదాయక ప్రసంగం ఘనంగా 89వ గోతురుత్ బోట్ రేస్: పురాతన సంప్రదాయాన్ని గుర్తుచేసుకున్న కేరళ సీఎం వి.డి. సతీశన్ కోనసీమలో భారీ విస్ఫోటనం... ధ్వంసమైన ఇల్లు.. యువకుడికి తీవ్ర గాయాలు.. జనసేన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కమిటీ సమన్వయకర్తగా మంత్రి కందుల దుర్గేష్: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం దుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్

ఆక్స్‌ఫర్డ్ టెడ్ ఎక్స్ వేదికపై అదరగొట్టిన గంటా మనవడు: 9 ఏళ్ల జిష్ణు ఆర్యన్ స్ఫూర్తిదాయక ప్రసంగం

Select Suryaa Now
ఆక్స్‌ఫర్డ్ టెడ్ ఎక్స్ వేదికపై అదరగొట్టిన గంటా మనవడు: 9 ఏళ్ల జిష్ణు ఆర్యన్ స్ఫూర్తిదాయక ప్రసంగం

సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మనవడు, తొమ్మిదేళ్ల గంటా జిష్ణు ఆర్యన్ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటికే గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించి తన అసాధారణ జ్ఞాపకశక్తిని చాటుకున్న జిష్ణు, తాజాగా ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ టెడ్ ఎక్స్ ఒస్నే వేదికపై ప్రసంగించి అందరినీ అబ్బురపరిచాడు. ఇంత చిన్న వయసులోనే అంతర్జాతీయ వేదికపై ఆత్మవిశ్వాసంతో ప్రసంగించిన అతి కొద్దిమంది బాలల్లో ఒకడిగా నిలిచి తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటాడు. నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లుగా ఉన్న తల్లిదండ్రులు గంటా రవితేజ, శరణి ప్రోత్సాహంతో ఎదిగిన జిష్ణు, ఈ వేదికపై తన తల్లితో కలిసి పాల్గొనడం విశేషం. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కూడా జిష్ణు ఆర్యన్‌కు తాత కావడం గమనార్హం.

గతంలో గణితంలో అత్యంత సంక్లిష్టమైన గోల్డెన్ రేషియోలోని 216 దశాంశ స్థానాలను కేవలం నిమిషం లోపే అనర్గళంగా చెప్పి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన జిష్ణు, ఆక్స్‌ఫర్డ్ వేదికపై తన వినూత్న ఆలోచనలతో సభికులను ఆకట్టుకున్నాడు. 'క్కు వాడిస్ - వేర్ ఆర్ యూ గోయింగ్?' అనే ప్రత్యేక ఇతివృత్తంపై మాట్లాడిన ఈ బుడతడు, చిన్న వయసులోనే ఎంతో పరిపక్వతతో కూడిన భావాలను పంచుకున్నాడు. ముఖ్యంగా ఫుట్‌బాల్ ఆటపై తనకు ఉన్న అపారమైన మక్కువను ప్రస్తావిస్తూ, తన భవిష్యత్తును తానే స్వయంగా నిర్దేశించుకుంటానని స్పష్టం చేశాడు. పెద్దల ఆశయాలు, సమాజపు ఒత్తిళ్లకు తలొగ్గకుండా పిల్లలు తమ సొంత కలలను ఎలా సాకారం చేసుకోవాలో తనదైన శైలిలో వివరించాడు.

Current image

జీవితంలో ఎదురయ్యే గెలుపు ఓటములకు కృంగిపోకూడదని, భయాలను అధిగమించి ముందుకు సాగడమే నిజమైన విజయమని జిష్ణు ఆర్యన్ చేసిన ప్రసంగం శ్రోతలను ఎంతగానో ఆలోచింపజేసింది. చిన్న వయసులోనే ఆత్మవిశ్వాసం, పట్టుదల, లక్ష్య సాధన గురించి అతను విశ్లేషించిన తీరు అంతర్జాతీయ ప్రతినిధులను మంత్రముగ్ధులను చేసింది. పిల్లల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారని నిరూపించిన జిష్ణు ఆర్యన్‌పై కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు, నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.