BREAKING
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసియా క్రీడల్లో రజతం సాధించిన మహిళా షూటర్లకు ప్రధాని మోదీ ప్రశంసలు: దేశానికి గర్వకారణమంటూ అభినందనలు ఆకర్షణీయంగా స్కూల్ యూనిఫారాలు : సీఎం రేవంత్ మంచిర్యాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ పెండింగ్ రోడ్డు పనులు, హెచ్ ఎల్ బి ల నిర్మాణం కేంద్రం దృష్టికి సమస్యల వివరణ పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధికి కృషి తెలంగాణకు భారీ వర్ష సూచన.. మూడు రోజులు అప్రమత్తం బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణకు వర్ష సూచన రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం సోమవారానికి వాయుగుండంగా, మంగళవారానికి తీవ్ర వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుమ మేయర్ స్థానం దళితులకు కేటాయించాల్సిందే కేజీబీవీ ఘటనలో బాధ్యులను గుర్తిస్తాం: గంటా నేడు ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌కు శంకుస్థాపన అన్ని ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ ప్రాజెక్టులకు సంబంధించిన అలాట్‌మెంట్ లెటర్లు రేపటి నుండి ఎస్ఎంఎస్ వాట్సాప్, టీజీ హెచ్బి వెబ్సైట్ ద్వారా వెబ్‌సైట్ ద్వారా లబ్ధిదారులకు అందజేత గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చే శంకుస్థాపన బిజెపి తీర్థం పుచ్చుకున్న కొవ్వాడ మాజీ ఎంపీపీ గోపాలకృష్ణమూర్తి రాజు తెలుగు గజల్ గాన విభావరి ఆక్స్‌ఫర్డ్ టెడ్ ఎక్స్ వేదికపై అదరగొట్టిన గంటా మనవడు: 9 ఏళ్ల జిష్ణు ఆర్యన్ స్ఫూర్తిదాయక ప్రసంగం ఘనంగా 89వ గోతురుత్ బోట్ రేస్: పురాతన సంప్రదాయాన్ని గుర్తుచేసుకున్న కేరళ సీఎం వి.డి. సతీశన్ కోనసీమలో భారీ విస్ఫోటనం... ధ్వంసమైన ఇల్లు.. యువకుడికి తీవ్ర గాయాలు.. జనసేన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కమిటీ సమన్వయకర్తగా మంత్రి కందుల దుర్గేష్: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం దుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్

కోనసీమలో భారీ విస్ఫోటనం... ధ్వంసమైన ఇల్లు.. యువకుడికి తీవ్ర గాయాలు..

Select Suryaa Now
కోనసీమలో భారీ విస్ఫోటనం... ధ్వంసమైన ఇల్లు.. యువకుడికి తీవ్ర గాయాలు..

భారీ శబ్దంతో బెంబేలెత్తిన స్థానికులు.. ఇంటి అద్దాలు ధ్వంసం

విస్ఫోటనంపై పోలీసుల దర్యాప్తు.…అమలాపురం మేజర్ న్యూస్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంలోని మహిపాల వీధిలో ఆదివారం ఉదయం 

భారీ విస్ఫోటనం కలకలం రేపింది. రిటైర్డ్ హెడ్‌మాస్టర్ ఎం.ఎస్.ఎన్. మూర్తి నివాసంలో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విస్ఫోటనం ధాటికి ఇంటి కిటికీలు, అద్దాలు ధ్వంసమై దూరంగా ఎగిరిపడ్డాయి.

ఆ సమయంలో పై బెడ్‌రూమ్‌లో ఉన్న మూర్తి కుమారులు గది నుంచి బయటకు ఎగిరిపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో మలిశెట్టి సాయిరామ్‌ (24)కు చేతులు, కాళ్లకు సుమారు 20 శాతం కాలిన గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కాకినాడలోని ట్రస్ట్ ఆసుపత్రి ప్రత్యేక బర్న్స్ వార్డుకు తరలిస్తున్నారు.

అయితే ఈ భారీ విస్ఫోటనానికి అసలు కారణం ఏమిటన్నది ప్రస్తుతం మిస్టరీగా మారింది. పిడుగుపాటు కారణమా? లేక గ్యాస్ సిలిండర్ పేలుడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లోని రెండు గ్యాస్ సిలిండర్లు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఘటనపై పూర్తి వివరాలు తేల్చేందుకు రాజమండ్రి నుంచి ఫోరెన్సిక్ నిపుణులను రప్పించారు.

అమలాపురం డీఎస్పీ టి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, పట్టణ సీఐ వీరబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, టీడీపీ నాయకుడు మెట్ల రమణబాబు, జనసేన నాయకులు కల్వకొలను తాతాజీ, ఏడిద శ్రీను తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.