దుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్
ఇంద్రకీలాద్రి, సెప్టెంబరు 20, మేజర్ న్యూస్ : ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ ఆదివారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.