andhrapradesh
ఎమ్మెల్యే ఉగ్ర అభివృద్ధి చూసే టీడీపీలోకి వచ్చాం
ఎమ్మెల్యే ఉగ్ర అభివృద్ధి చూసే టిడిపిలోకి వచ్చాం
- పామూరులో అఖండ మెజార్టీతో టీడీపీని గెలిపించి ఎమ్మెల్యే ఉగ్రకు కానుకగా ఇస్తాం
- యాదాల వెంకట సాయి కిరణ్
పామూరు, మేజర్ న్యూస్ : కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను చూసే తాను, తనతో పాటు వైసీపీకి చెందిన 100 కుటుంబాలు టీడీపీలో చేరినట్లు పామూరు మేజర్ పంచాయతీ ఉపసర్పంచ్ యాదాల వెంకట సాయి కిరణ్ తెలిపారు. వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సారధ్యంలో పార్టీలో చేరిన అనంతరం యాదాల వెంకట సాయి కిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. పామూరు పట్టణంలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ, నెల్లూరు రోడ్డు డబుల్ రోడ్డు సిమెంట్ రోడ్డుతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు. సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా ప్రజలకు అందుతున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై దూరదృష్టితో ముందుకు సాగుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో పామూరు మేజర్ పంచాయతీలో టీడీపీకి అఖండ మెజార్టీ సాధించి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి కానుకగా ఇచ్చేందుకు కృషి చేస్తానని యాదాల వెంకట సాయి కిరణ్ స్పష్టం చేశారు.